Homeఆంధ్రప్రదేశ్‌Telangana: తెలంగాణలో సరికొత్త దోపిడీ.. వాహనదారుల నుంచి ప్రైవేటు వసూళ్లు!

Telangana: తెలంగాణలో సరికొత్త దోపిడీ.. వాహనదారుల నుంచి ప్రైవేటు వసూళ్లు!

Telangana: దోపిడీకి కాదేది అనర్హం. ఉపాయం ఉన్నవాడు ఉపవాసం ఉండడు అంటారు పెద్దరు. ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు చాలా మంది దోపిడీ దారులు.. కష్టపడి పని చేయకుండా ఈజీగా సంపాదించడం కోసం అనేక మార్గాలు అన్వేశిస్తున్నారు. కొందరు దొంగతనాలు చేస్తుంటే.. కొందరు ఆన్‌లైన్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొందరు బహిరంగంగానే వసూళ్లకు తెరలేపుతున్నారు. ఐడియా ఉంటే చాలు ఎలాగైనా సంపాదిచొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ శివారులో కొంత మంది ప్రభుత్వ అధికారుల ముసుగులో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికోసం ఓ స్టిక్కర్‌ అంటగడుతున్నారు. దీనికోసం రూ.300 వసూలు చేస్తున్నారు. రోడ్‌ సేఫ్టీ స్టిక్కర్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.

వసూళ్లు ఇలా..
హైదరాబాద్‌ శివారులో జాతీయ రహదారులు అక్రమ వసూలుదారులకు అడ్డాగా మారాయి. అధికారుల ముసుగులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొందరు. పాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కొందరు అడ్డాలు వేసి వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ వ్యక్తి అధికారి వేషధారణలో రోడ్డు పక్కన ఓ చెట్టుకింద కారులో కూర్చుని ఉంటాడు. ఇక ఓ ప్రైవేటు వ్యక్తి, కాఖీ యూనిఫాంలో ఉన్న మరో వ్యక్తి వాహనాలు ఆపి.. డబ్బులు వసూలు చేస్తారు. డబ్లు ఇచ్చినందుకు వారికి ఎలాంటి రశీదు ఇవ్వరు. కేవలం ఓ స్టిక్కర్‌ అంటగడతారు. ఒక్కో వాహనం నుంచి రూ.300 వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు రూ.లక్షకుపైగానే సంపాదిస్తున్నారు.

ఎదురు తిరగడంతో..
చాలాకాలంగా ఈ వసూళ్ల దందా సాగుతోంది. కానీ, వసూలు చేసేవారు ఎవరు అనే విషయం ఎవరూ ప్రశ్నించడం లేదు. అంతా రవాణా అధికారులు అని భావించారు. కానీ, ఓ వ్యక్తి ఎదురు తిరగడంతో బండారం బయటపడింది. ఓ వామనంలో వెళ్తున్న వ్యక్తిని అక్కడి వ్యక్తులు ఆపారు. రూ.300 చెల్లించి స్టిక్కర్‌ కొనుగోలు చేయాలని సూచించారు. దానికి ఎందుకు కొనాలని ప్రశ్నించాడు. తన వద్ద అన్ని అనుమతులు ఉన్నాయి అని చూపించాడు. రోడ్‌ సేఫ్టీ స్టిక్కర్‌ అని ఎదుటి వ్యక్తి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌.. తనవద్ద ఉన్న రోడ్‌ ట్యాక్స్‌ రశీదు చూపించాడు. అయినా తన స్టిక్కర్‌ కొనాలని పట్టుపట్టాడు. దీంతో ఈ సంభాషణను వీడియో తీస్తూ.. వాహనం దిగి ఖాకీ యూనిఫాంలో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లాడు. మీరంతా ఎవరని ప్రశ్నించాడు. తెలంగాణ పోలీస్‌ లోగో పెట్టుకుని డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారని నిలదీశాడు. నేమ్‌ ప్లేట్‌ ఎక్కడ అని నిలదీశాడు. దీంతో ఖాకీ యూనిఫాంలో ఉన్న వ్యక్తి.. సార్‌ దగ్గరకు వెళ్లమని సూచించాడు. దీంతో డ్రైవర్‌ సార్‌ ఎవరు.. మీరు అధికారికంగా డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారని నిలదీశారు. దీంతో ఖాకీ యూనిఫాంలో ఉన్న వ్యక్తి, స్టిక్కర్‌ అంటగట్టేందుకు యత్నించిన వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నారు. తర్వాత డ్రైవర్‌ వాహనంతో అక్కడి నుంచి ఎలాంటి ఫీజు కట్టకుండానే వెళ్లిపోయాడు. అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి వారు వసూలు చేస్తూనే ఉంటారు. ఇప్పటికైనా వాహనదారులు ఎందుకు డబ్బులు ఇస్తున్నామో గుర్తించాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version