Attack On Jagan: ఏపీలో సీఎం జగన్ పై గులకరాయి దాడి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. విపక్షాలు ఈ దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకువచ్చి సీఎంపై రాయిదాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి. మరోవైపు అధికారపక్షం ఈ ఘటనను రాజకీయంగా ఎంత వాడుకోవాలో.. అంతలా వాడుకుంటుంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ పై పెత్తందారుల దాడి అంటూ హైలెట్ చేస్తున్నారు. అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఐదుగురు యువకులు పట్టుబడినట్లు తెలుస్తోంది. అందులో అందరూ మైనర్లు కావడం విశేషం.
యితే ఈ రాయి దాడి జరిగిన వెంటనే రాజకీయ రంగు పులుముకుందే కానీ.. భద్రత వైఫల్యం హైలెట్ కాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై కోడి కత్తితో దాడి జరిగింది. ఆ సమయంలో భద్రత వైఫల్యం అంటూ ఇదే వైసిపి ఆరోపించింది. కానీ ఇప్పుడు అదే వైసీపీ అధికారపక్షంగా ఉంది. జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ భద్రత వైఫల్యం పై మాత్రం వైసిపి మాట్లాడడం లేదు.కానీ ఐదుగురు మైనర్ యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.గతంలో కోడి కత్తి దానికి సంబంధించి నిందితుడు కూడా మైనర్.ఇప్పుడు పట్టుబడిన ఈ ఐదుగురు యువకులు మైనర్ లేనని తెలుస్తోంది.
అయితే ఇందులో ఒక యువకుడు రాయి విసిరాడని.. దానికి ఒక కారణం ఉందని సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన రూమర్ నడుస్తోంది. సీఎం రోడ్ షోకు హాజరైతే క్వార్టర్ మందు, రూ.350డబ్బులు ఇస్తారని పిలిచారని.. అయితే అక్కడికి వచ్చాక మందు సీసా మాత్రమే ఇచ్చారని.. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో సీఎం మీదకు రాయి విసిరానని ఓ యువకుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత ఉంది? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ప్రతిపక్షాల కుట్రపూరితంగా రాళ్లదాడి చేయించారని ఆరోపించిన వైసీపీకి ఇబ్బందికర పరిణామమే ఎదురుకానుంది. అయితే వాస్తవాలను దర్యాప్తు అధికారులు వెల్లడించగలరా? ఆ పరిస్థితి ఉందా? అంటే మాత్రం సమాధానం దొరకదు.