Skill Development Case: ఎన్నికల వేళ చంద్రబాబు ‘స్కిల్ స్కామ్’ ఊహించని ట్విస్ట్

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది.ఆయన 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Written By: Dharma, Updated On : April 17, 2024 11:01 am

Skill Development Case

Follow us on

Skill Development Case: ఏపీలో ఎన్నికల జరుగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సిఐడి, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలను వినిపించింది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కోర్టు ఆదేశాలను పాటించడం లేదని.. బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోర్టు ముందు ఉంచారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాటిని పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది.ఆయన 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఏపీ హైకోర్టు తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని.. ఎన్నో రకాల అభ్యంతరాలు వ్యక్తం చేసిన వినలేదని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది. పలుమార్లు విచారణ కూడా జరిగింది. అందులో భాగంగా తాజాగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.చంద్రబాబు పదేపదే ఈ కేసు గురించి మాట్లాడుతున్నారని.. లోకేష్ రెడ్ బుక్ పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. తాము అధికారంలోకి వస్తేఈ కేసులో సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని కోర్టు ముందుకు తీసుకొచ్చారు.

చంద్రబాబు అడుగడుగున కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని సిఐడి తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. అదే సమయంలో చంద్రబాబు తరుపు న్యాయవాదుల సైతం కీలక అంశాలను న్యాయస్థానం ముందు ఉంచారు. ఎన్నికల సమయం కావడంతో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే సిఐడి ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని చంద్రబాబుకు సూచించింది. కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును ఇరుకున పెట్టాలని సిఐడి భావించింది. కానీ అనుకున్న స్థాయిలో సిఐడి వాదనలు వినిపించలేకపోయింది. అయితే ఎన్నికల సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సంచలనాలు నమోదవుతాయని భావించిన వారికి నిరాశే ఎదురయింది.