AP tourism: సాధారణంగా టిడిపి ప్రభుత్వం( TDP government) అంటే పర్యాటక రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉమ్మడి ఏపీతోపాటు నవ్యాంధ్రప్రదేశ్లో పర్యాటకంగా చాలా అడుగులు పడ్డాయి. అయితే ఇప్పుడు విశాఖలో పర్యాటక రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు ఐటీ పరిశ్రమల ఏర్పాటుతో పాటు పర్యాటక ప్రాజెక్టులను సైతం ఏర్పాటు చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. వైసిపి హయాంలో పర్యాటక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అందుకే టిడిపి కూటమి ప్రభుత్వం దానికి పరిశ్రమ హోదా కల్పించింది. ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తోంది. దీంతో విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది.
అందుబాటులో డబుల్ డెక్కర్ బస్సులు..
ఇటీవల విశాఖ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు( double decker buses ) అందుబాటులోకి వచ్చాయి. ఆ బస్సుల్లో ప్రయాణిస్తూ పర్యాటక అందాలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. రామకృష్ణ బీచ్ నుంచి తొట్లకొండ వరకు సముద్ర తీరం వెంబడి సాగే సువిశాలమైన రోడ్డుపై ఈ డబ్బులు డెక్కర్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే ఏపీ సీఎం చంద్రబాబు వాటిని ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జి కైలాసగిరి వద్ద ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద ది. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు విశాఖలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
Also Read: పవన్ దేవుడివయ్యా.. పిఠాపురం ప్రజలు ఫిదా!
అరకులో కొత్త ప్రాజెక్ట్..
ఇప్పుడు అరకులో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా విశాఖకు వచ్చే పర్యాటకులు అరకు అందాలు చూడకుండా తిరిగి వెళ్ళరు. అరకు చేరుకునేందుకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి అద్దాలు బిగించిన విస్టా డోమ్ కోచ్ తో కూడిన ప్యాసింజర్ రైలు.. ఎప్పటినుంచో ప్రతిరోజు నడుస్తోంది. కొండలు, గుహల్లో నుంచి లోయల పక్కగా సాగే దానిలో ప్రయాణం ఒక మహా అద్భుతం. అయితే ఇప్పుడు అరకులో మరో పర్యాటక ఆకర్షణ జోడించారు. అదే హాట్ ఎయిర్ బెలూన్ రైడ్( hot air balloon ride ). అరకు లోని పద్మాపురం ఉద్యానవనంలో పాడేరు ఐటీడీఏ పీవో చేతుల మీదుగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ప్రారంభమైంది. దీనిని నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. తొలిసారిగా దీనిని ఏపీలో ప్రవేశపెట్టారు. అనేకసార్లు విజయవంతంగా ట్రైల్ రన్స్ పూర్తి చేశారు. పర్యాటకులకు సురక్షితమే అని తెలిశాక అరకులో ఏర్పాటు చేశారు. త్వరలో అరకులో పారా మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తానికైతే విశాఖలో టూరిజం ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం విశేషం.