YSR Congress : ఈ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయింది.దారుణాతి దారుణంగా ఓటమి చవిచూసింది.వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగింది. కానీ 11 స్థానాలకే పరిమితం అయ్యింది. ఈ ఓటమిని సొంత పార్టీ శ్రేణులు కూడా తట్టుకోలేకపోతున్నాయి.అయితే చివరి నిమిషం వరకు విజయం పై ఆ పార్టీ శ్రేణులు ధీమాతోనే ఉన్నాయి. కనీసం 90 సీట్లతోనైనా అధికారంలోకి వస్తాం అన్న భావన ఉండేది. అయితే పార్టీ అధినాయకత్వం సైతం అదే ధీమా కనబరిచింది. అందుకే విశాఖలో ప్రమాణ స్వీకారం వేడుకలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఇంతటి ప్రేమకు చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐపాక్ టీం తో పాటుమీడియా మొత్తం వైసీపీకి అనుకూలంగా పనిచేసింది. పేరు మోసిన జర్నలిస్టులంతా ఫ్రీ లాండ్స్ గా వ్యవహరిస్తూ వైసిపికి అనుకూల విశ్లేషణలు ఇచ్చారు. వెబ్సైట్లతో పాటు యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పనవసరం లేదు. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ తో తమకు మరోసారి విజయం ఖాయమని వారు ఒక అంచనాకు వచ్చారు.కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి.దారుణ ఫలితాలు వచ్చాయి. అయితే వైసిపి ఎంతలా మీడియా మేనేజ్ చేసినా వాటిని ఎదురయ్యేసరికి ఆ పార్టీ నేతలకు అసలు తత్వం బోధపడింది.
* ప్రచారానికి రోజుకు కోటి రూపాయలు పై మాటే
మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. ఈ 80 రోజులకు గాను వైసిపి ప్రచారానికి మీడియాకు ఖర్చు చేసినది అక్షరాల 87 కోట్లు. ఇందులో టీవీ9, ఎన్టీవీ, 10 టీవీలకు ప్రకటనల రూపంలో కోట్ల రూపాయలు కేటాయించారు.ఇంకా యూట్యూబ్ చానల్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. భారీగా కేటాయింపులు చేశారు. ఐ డ్రీమ్ వంటి ఛానళ్లకు పెద్ద పీట వేశారు.
* ఆ జర్నలిస్టులు సొంతంగా నిలదొక్కుకునేలా
వైసిపి వ్యతిరేక మీడియాలో పనిచేసే జర్నలిస్టులు చాలామంది సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. అటువంటి వారికి కోట్లాది రూపాయలు ముట్టజెప్పినట్లు సమాచారం. వారిని సదరు చానళ్ళలో రాజీనామా చేయించి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మీడియాకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా వైసీపీకి మాత్రంఓటమి తప్పక పోవడం విశేషం.