Anna Canteens: నిరుపేదలకు( poor people ) తక్కువ ధరకే ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 200 క్యాంటీన్లకు( Anna canteens ) పైగా అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో 63 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు నిరుపేదల కడుపు నింపాయి. ఐదు రూపాయలకే ఆహారం అందించడం.. శుచి, శుభ్రతకు పెద్ద పీట వేయడంతో ఎక్కువమంది ఇక్కడ భోజనాలు చేసేందుకు ఇష్టపడ్డారు. అయితే తొలుత నగరాలకు పరిమితం అయిన అన్న క్యాంటీన్లు తర్వాత పట్టణాలకు విస్తరించారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే 63 గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీటి ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
* కొత్తగా గ్రామీణ నియోజకవర్గాల్లో
కొత్తగా ఏర్పాటు చేసి 63 అన్న క్యాంటీన్ల( Anna canteens ) ద్వారా రోజుకు మూడు పూటలా 50 వేల 337 మందికి ఆహారం అందించునున్నారు. ప్రస్తుతం ఉన్న అన్న క్యాంటీన్లలో.. ఒక్కో క్యాంటీన్లో మూడు పూటలా సగటున 799 మందికి అల్పాహారం, ఆహారం అందిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో సైతం ఈ 63 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. పనుల నిర్వహణకు సంబంధించి టెండర్లు పిలుస్తారు. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై నెలాఖరులోగా ఒక నిర్ణయానికి వస్తారు.
* విజయవంతంగా క్యాంటీన్లు
రాష్ట్రవ్యాప్తంగా ( State wise)అన్న క్యాంటీన్లు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందిస్తున్నారు. భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించారు. క్యాంటీన్ల నిర్వహణపై సైతం సంతృప్తి కనిపిస్తోంది. ఆహారంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో క్యాంటీన్లలో భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంకోవైపు గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో సైతం వీటిని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోంది. దీంతో గ్రామీణ నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 199 క్యాంటీన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటికి మరో 63 క్యాంటీన్లు జతకానున్నాయి.
* ఇప్పటివరకు ఆహారం అందింది ఇలా
కూటమి( allians government ) అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 1.54 కోట్ల మంది క్యాంటీన్లలో భోజనం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అల్పాహారం తీసుకున్న వారు 56,49, 193 మంది, మధ్యాహ్నం భోజనం చేసిన వారు 63,46,720 మంది, రాత్రి భోజనాలు చేసిన వారు 33,94,605 మంది.. మొత్తం క్యాంటీన్లలో భోజనం చేసిన వారు 1,53,90,518 మంది. అయితే అన్న క్యాంటీన్లలో అందుతున్న ఆహారంపై సామాన్యుల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. పేదల కు పట్టెడన్నం పెట్టేందుకు ఏర్పాటైన ఈ క్యాంటీన్లు లక్ష్యానికి చేరువ అవుతున్నాయి.