Christmas Holidays : క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది విద్యా సంస్థలకు తెలుగు రాష్ట్రాల్లో ముందే సెలవులు వచ్చాయి. సాధారణంగా క్రిస్మస్ రోజు అంటే డిసెంబర 25న తర్వాతి రోజు బాక్సింగ్ డే సందర్భంగా డిసెంబర్ 26న ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ 24న కూడా సెలవు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచే సెలవులు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రకటించిన విద్యా క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 25, 26 తేదీల్లో హాలీడేస్‌గా ప్రకటించింది. ఈ రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలతోపాటు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవులు. డిసెంబర్ 24న ఆప్షనల్ హాలిడే ఉండడంతో కొన్ని స్కూళ్లకు ఈ రోజు కూడా సెలవు ప్రకటించుకున్నారు. ఈరోజు సెలవు తీసుకున్నవారు మరో రోజు విద్యా సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది.
2025 హాలిడేస్..
ఇదిలా ఉంటే.. 2025 ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల హాలిడేస్ ఉన్నట్లు జాబితలో పేర్కొంది. ఈ సెలవుల్లో మొట్ట మొదటిది జనవరి 1న వస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సెలవు తీసుకునే అవకాశం ఉంది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారం వర్కింగ్‌డేగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్మస్ సెలవుల విషయానికి వస్తే.. డిసెబర్ 25న హాలిడేగా ప్రకటించింది. డిసెంబర్ 24, 26వ తేదీల్లో ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. దీంతో ఈసారి క్రిస్మస్ సందర్భంగా ఏపీలోనూ విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు వచ్చాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లు, కాలేజీలు మాత్రం ఆప్షనల్ హాలడే రోజు కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది.
2025 ఏపీ సెలవులు..
ఇక ఏపీలో 2025 సంవత్సరంలో సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. సాధారణ సెలవులు, ఆప్ఫనల్ హాలిడేస్ రెండూ కలిసి 44 రోజులు సెలవు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. రిపబ్లిక్‌డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం వచ్చాయి.