Homeఆంధ్రప్రదేశ్‌Nallamala : నల్లమలలో భూగర్భ సొరంగం.. ఏకంగా 27 కిలోమీటర్లు.. ప్రభుత్వం భారీ వ్యూహం వెనుక...

Nallamala : నల్లమలలో భూగర్భ సొరంగం.. ఏకంగా 27 కిలోమీటర్లు.. ప్రభుత్వం భారీ వ్యూహం వెనుక కథ

Nallamala :  ఏపీ ప్రభుత్వం( AP government) మరో భగీరథ ప్రయత్నం చేస్తోంది. గోదావరి- బనకచర్ల నదుల అనుసంధానం కోసం ఏకంగా నల్లమల అడవుల్లో( nallamala reserve forests ) భూగర్భ సొరంగానికి ప్రయత్నిస్తోంది. దాదాపు 27 కిలోమీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ టన్నెల్( underground tunnel) నిర్మాణానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టును అనుసంధానిస్తే వేల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయవచ్చు. సాగుతో పాటు తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. అయితే మధ్యలో నల్లమల అడవులు అడ్డంకిగా మారాయి. అయితే ఇక్కడ కాలువ నిర్మాణం చేపట్టాలంటే అటవీ, పర్యావరణ అనుమతులు రావడం చాలా కష్టం. అందుకే ఇక్కడ భూగర్భంలో( underground) టన్నెల్ నిర్మాణం చేపడితే సులువుగా నీటిని తరలించవచ్చు. ఈ టన్నెల్ ద్వారా 24 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేందుకు 118 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కాలువ తవ్వాల్సి ఉంటుంది. ఇందులో మూడు చోట్ల నీటిని ఎత్తి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీంతో నిర్వహణకు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దాని బదులుగా భూగర్భ సొరంగం నిర్మిస్తే చాలా సులువుగా.. తక్కువ ఖర్చుతో నీటిని తరలించవచ్చు.

* అటవీ ప్రాంతంలో తప్పనిసరి
బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత.. వాటిని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తీసుకు వెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్ళించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం అటవీ, పర్యావరణ అనుమతులు( forest, pollution permissions ) సులభంగా పొందడానికి టన్నెల్ ను భూగర్భంలో నిర్మించనున్నట్లు సమాచారం. ఇది వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం కావడంతో.. అటవీ భూమిలో నీటిని ప్రవహింపజేసేందుకు ఈ టన్నెల్ ను భూగర్భంలో నిర్మించాలనుకుంటున్నారు. టన్నెల్ ప్రారంభం, అవుట్ ఫ్లో ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో కాకుండా ప్లాన్ చేశారు. ఈ టన్నెల్ నిర్మాణానికి 17వేల ఎకరాల అటవీ భూమి అవసరం అని గుర్తించారు. ఇందులో 15 వేల ఎకరాలు బొల్లాపల్లి జలాశయంలో కావాలి. పోలవరం జలాశయం నుండి కృష్ణానది వరకు నీటిని తీసుకువెళ్లే మార్గంలో ఎక్కడ ఎత్తిపోతల అవసరం లేకుండా కాలువల సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేది ఒక ప్రత్యేక ప్రణాళికగా వేసుకున్నట్లు సమాచారం.

* కాలువల విస్తరణ అనివార్యం
ప్రస్తుతం పోలవరం కుడి కాలువ( polavaram right canal ) 187 కిలోమీటర్ల మేర తవ్వారు. అయితే దీనిని 28 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి తగ్గట్టు విస్తరించాలి. ఉమ్మడి పశ్చిమగోదావరి కాలువను మరో 108 కిలోమీటర్ల మేర పొడిగించాలి. దాని సామర్ధ్యాన్ని కూడా పదివేల క్యూసెక్కులకు( 10000 cuisex) పెంచాలి. అయితే ఇది భారీ ప్రాజెక్టు. దీనికి అనుమతులు తప్పనిసరి. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం.. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం కొనసాగుతుండడంతో అనుమతులు చాలా సులువుగా వస్తాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular