Election Commission: ఆంధ్రప్రదేశ్లో ( Andhra Pradesh) రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఏపీలో ఏకంగా 17 పార్టీలను రద్దు చేసింది. గుర్తింపు పార్టీల జాబితా నుంచి తొలగించింది. దేశవ్యాప్తంగా 474 పార్టీలను రద్దు చేయడం విశేషం. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం 9 పార్టీలు రద్దయ్యాయి. గత ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోవడంతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీల గుర్తింపు రద్దు చేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. గత రెండు విడతల్లో కలిపి 808 రాజకీయ పార్టీలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసినట్లు అయ్యింది. చాలా కాలంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతోనే ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది.
ఏపీ నుంచి అధికమే..
ఏపీ నుంచి 17 పార్టీల గుర్తింపు రద్దయింది. ఇందులో భారతీయ చైతన్య పార్టీ( Bhartiya Chaitanya party ), జై సమైక్యాంధ్ర పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా లిబరల్ పార్టీ, భారత్ ప్రజాస్పందన పార్టీ, ఆల్ ఇండియా మంచి పార్టీ, భారతీయ సదర్మ సంస్థాపన పార్టీ, వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ, వైయస్సార్ బహుజన పార్టీ, గ్రేట్ ఇండియా పార్టీ, జై ఆంధ్ర పార్టీ, పేదరిక నిర్మూలన పార్టీ, పేదల పార్టీ, ప్రజా పాలన పార్టీ, సమైక్య తెలుగు రాజ్యం పార్టీ, రాయలసీమ కాంగ్రెస్ పార్టీ, పొలిటికల్ ఎస్ఎంసిఎల్ అండ్ ఆక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీ.. తదితర పార్టీలను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
* తెలంగాణలో తొమ్మిది.. తెలంగాణకు( Telangana) సంబంధించి పార్టీల రద్దు జాబితాలో.. లోక్సత్తా పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ బీసీ, భారతదేశం పార్టీ, ఆలిండియా బిసి ఓబీసీ పార్టీ,భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ లను ఈసీ రద్దు చేసింది. అయితే దేశవ్యాప్తంగా మరో 359 రాజకీయ పార్టీలను కూడా తొలగింపు జాబితాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టే.