Lecturer Posts Recruitment in AP: ఆంధ్రప్రదేశ్‌లోని 19 యూనివర్సిటీల్లో అధ్యాపకులు, లైబ్రేరియన్‌లు, లెక్చరర్ల పోస్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,523 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఈరోజు (జూన్ 8, 2026) సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఏయే పోస్టులు ఉన్నాయి..
వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు రాష్ట్రంలోని 19 యూనివర్సిటీల్లో వివిధ శాఖలలో అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు..
పోస్టు మేరకు అర్హతలు మారుతాయి. సాధారణంగా కావాల్సిన విద్యార్హతలు పీజీ(మాస్టర్స్ డిగ్రీ), పీహెచ్‌డీ / ఎంఫిల్, నెట్ / ఏపీ సెట్ / ఏపీ ఎస్‌ఎల్‌ఈటీలో ఉత్తీర్ణత సంబంధిత రంగంలో బోధనా / పరిశోధనా అనుభవం ఉండాలి. ప్రతీ పోస్టుకు సంబంధించిన వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఉన్నాయి. అభ్యర్థులు తమ యూనివర్సిటీ, పోస్టును జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ ఇలా…
విద్యార్హతలు, పరిశోధనా అనుభవం, ప్రచురణలు మరియు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తేదీ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇలా దరఖాస్తు చేయాలి..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://apuniversitiesrecruitment.apcfss.in/ కు వెళ్లాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, సరైన యూనివర్సిటీ, పోస్టును ఎంచుకోండి. అన్ని వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. తర్వాత దరఖాస్తు సమర్పిచాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా నిర్దేశిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది (జూన్ 15 వరకు).
ఉన్నత విద్యా రంగంలో స్థిరపడే అపూర్వ అవకాశం. అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఈరోజే సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.
