KCR Delhi Tour: నిండు కుండ ఎప్పుడూ తొలకదు.. సగం కుండ మాత్రం తుళ్లిపడుతుంది.. ఇలాగే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీరు. దేశ్‌కీ నేత అనిపించుకునేందుకు తెలంగాణ ప్రజల సొమ్ము రూ.18 కోట్లు పట్టుకుని దేశయాత్రకు బయల్దేరిన కేసీఆర్ ఢిల్లీలో లాంచ్ అయ్యారు. పర్యటనలో మొదటి రోజు శనివారం మధ్యాహ్నం నుంచి పాయంత్రం వరకు బిజీ బిజీగా గడిపారు. లంచ్ మీట్లో సమాజ్‌వాదీపార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను ఇంటికి పిలిపించుకుని సుదీర్ఘ మంతనాలు సాగించారు. సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్లో కలిసి అక్కడి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.
రాజకీయ నేతలతో రాజకీయాలే చర్చిస్తాం..
ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల పరిశీలన అనంతరం కేసీఆర్ అక్కడికి వచ్చిన మీడియాతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. ఢిల్లీ ముఖ్యమంత్ర మాత్రం పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో విద్యా విధానం బాగుందని, ఇక్కడి విధానం తెలంగాణలో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలల బలోపేతం కోసం తెలంగాణ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలతో బృందాన్ని ఢిల్లీకి పంపించి అధ్యయనం చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు దేశ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు.. అఖిలేష్‌తో ఏం మాట్లాడారు అని అడిగారు. కేసీఆర్ సమాధానం ఇస్తూ ‘బిజినెస్‌మెన్‌తో బిజి¯ð స్ గురించి మాట్లాడుతాం.. రాజకీయ నాయకులతో రాజకీయాలే మాట్లాడుతాం.’ అన్నారు. మీ వ్యూహం ఎలా ఉండబోతుంది అని అడగగా.. ‘దేశంలో ఓ రాజకీయ సంచలనం జరగాల్సి ఉంది.. జరుగుతుంది’ అని ప్రకటించారు. ఆ సంచలనం ఏమిటన్నదానిపై ఆయన ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.
Also Read: KCR- Modi: ఈసారి కూడా కేసీఆర్ మోడీని కలవడం లేదా?
వారి మౌనం ఎదుకో..
కేసీఆర్‌తో భేటీ అయిన సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసిన స్పందించలేదు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా రాజకీయాల జోలికి పోలేదు. ‘కేసీఆర్ మా పాఠశాలలను చూసేందుకు రావడం అనందంగా ఉంది. ఇది మాకు గౌరవంగా భావిస్తున్నాం’ అంటూ ముక్తసరిగా మాట్లాడారు. ఇద్దరు నేతలూ మౌనం వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కే జ్రీవాల్‌కు తెలంగాణ ముఖ్యమంత్రిని అయిష్టంగానే కలిశారన్న గుజగుసలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో.. అక్కడి రైతులకు కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో తప్పనిసరై కేసీఆర్‌తో సమావేశమైనట్లు పొలిటికల్ టాక్. ఇక ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌ను కలువడం ఇదే తొలిసారి. యూపీ ఎన్నికల్లో అఖిలేష్ గెలుపు కోసం కేసీఆర్ ఆర్థికసాయం చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినా అఖిలేష్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆర్థికసాయం చేసిన నేత కావడంతోనే కేసీఆర్ పిలిచిన వెంటనే అఖిలేష్ ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌ను కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి సంచనలం ఏమిటి?
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ దేశంలో సంచలనం జరుగుతందని ప్రకటిచడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చెప్పి చేసేవి.. చేయాలనుకున్నవి ఎప్పటికీ సంచనాలు కావు. అనుకోకుండా జరిగితేనే సంచలనాలు అవుతాయి. అయితే కేసీఆర్ పక్కా వ్యూహంతో సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీకే పెద్ద షాక్ ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అందుకు రాష్ట్రపతి ఎన్నికలను ఎంచుకున్నట్లు తెలిసింది.
బరిలో ప్రతిపక్షాల అభ్యర్థి
జూన్‌లో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇవ్వాలని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఎన్డీయే అభ్యర్థిపై ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈమేరకు ఎన్డీయే యేతర పార్టీలతో సంప్రదింపుల కోసమే ఢిల్లీ వెళ్లారని భావిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలను సందర్శించే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
జగన్‌కు గాలం వేస్తే.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకి.. ఎన్డీఏకు ఆటంకాలు లేవు. వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలు బీజేపీ పరిధి దాటిపోవు. అయితే వైసీపీ లాంటి పార్టీ హ్యాండ్ ఇస్తే మాత్రం బీజేపీకి షాక్ తగలొచ్చు. రాజకీయంగా సంచలనం నమోదు కావొచ్చు. కేసీఆర్‌తో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ దిశగా ఏమైనా సంచలనాలు ప్లాన్ చేస్తున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కేంద్రాన్ని కాదని జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ యేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. బీజేపీ పరిస్థితి సరిగా లేదనుకుంటే ఆయన ఎన్నికలకు ముందు బయటపడే అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే అప్పటి వరకూ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ మాత్రం గట్టి ప్రణాళికల్లో ఉన్నారని తన మాటల ద్వారానే వెల్లడిస్తున్నారు.
Also Read:Jagan Davos Tour: దావోస్ కు కుబేరులు వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ వెళ్లాడా?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Akhilesh yadav delhi cm kejriwal silent after cm kcr meet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com