Homeఎంటర్టైన్మెంట్Devi Sri Prasad: అప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు బడా ప్రొడ్యూసర్స్.. పదేళ్ల తర్వాత తనలోని...

Devi Sri Prasad: అప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడు బడా ప్రొడ్యూసర్స్.. పదేళ్ల తర్వాత తనలోని వైల్డ్ ఫైర్ బయటకు తీసిన దేవిశ్రీ! కారణం?

Devi Sri Prasad: సినిమా అనేది కలెక్టివ్ ప్రాజెక్ట్. ఒక మూవీ బయటకు రావాలంటే 24 క్రాఫ్ట్స్ కి చెందిన వారు పని చేయాలి. దర్శకుడు అనేక మందిని ఒక చోటకు చేర్చి పని చేయించుకోవాలి. ఈ క్రమంలో సాంకేతిక నిపుణులు, నటులు, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం చాలా ఉంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుకుపోతారు. పెద్ద గొడవలే జరిగినా వాటిని బయటపెట్టరు. ముఖ్యంగా బహిరంగ వేదికలపై వివాదాల గురించి మాట్లాడరు. మనసులో ఏమున్నా కానీ.. నవ్వుతూ ప్రశంసలు కురిపించి వెళ్ళిపోతారు.

కొందరు మాత్రం బహిరంగంగా తమ అసహనం బయటపెట్టి వార్తల్లో నిలుస్తారు. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ చెన్నై లో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. పుష్ప 2 విడుదల నేపథ్యంలో అక్కడ ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. మాట్లాడేందుకు వేదిక మీదకు వెళ్లిన దేవిశ్రీ.. పుష్ప 2 నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ పై ఆరోపణలు చేశారు. అడగనిదే ఎవరూ ఇవ్వరు. మనకు కావలసినది అడిగి తీసుకోవాలి. టైం కి పాట ఇవ్వలేదు, టైం కి స్కోర్ ఇవ్వలేదు అనడం సబబు కాదు.

మా నిర్మాతలకు నా మీద చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న చోట కంప్లైంట్స్ కూడా ఉంటాయి నా మీద వారికి ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. నేను ముక్కు సూటి మనిషిని గనుక బహిరంగంగా చెప్పేస్తున్నాను, అన్నారు. దేవిశ్రీ-మైత్రీ మూవీ మేకర్స్ కి చెడిందని ఆయన కామెంట్స్ క్లారిటీ వచ్చేసింది. కాగా గతంలో కూడా దేవిశ్రీ ఇలానే పబ్లిక్ లో ఫైర్ అయ్యాడు.

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లెజెండ్ చిత్రం 2014లో విడుదలైంది. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. లెజెండ్ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు బోయపాటి మీద దేవిశ్రీ విమర్శలు గుప్పించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ సంఘటన జరిగిన సరిగ్గా పదేళ్లకు దేవిశ్రీ మరోసారి బహిరంగ విమర్శలు చేసి వార్తలకు ఎక్కాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ తో విభేదాలకు దేవిశ్రీ సమయానికి సంగీతం ఇవ్వకపోవడమే. అలాగే ఈ ప్రాజెక్ట్ లో థమన్ ని ఇన్వాల్వ్ చేయడం కూడా దేవిశ్రీకి నచ్చకపోయి ఉండొచ్చు…

RELATED ARTICLES

Most Popular