Lord Krishna: మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవుల కోసం ఎంతో కష్టపడ్డాడు. బావమరుదుల బాగు కోసం అహర్నిశలు శ్రమించాడు. ధర్మం, న్యాయం ఉన్న పాండవుల పక్షమే వహించి కడదాకా వారి వెంట నిలుస్తాడు. కురుక్షేత్రం యుద్ధం 18 రోజుల పాటు సాగుతుంది. అందులో అందరు మరణిస్తారు. ఎవరైనా ధర్మం పక్షం లేకపోతే ఫలితం అలాగే ఉంటుందని మొదటి నుంచి కౌరవులకు చెప్పినా వారు వినరు. దీంతో ఎవరి కర్మకు వారే బాధ్యులని యుద్ధం చేస్తారు. యుద్ధంలో భీష్ముడి లాంటి వారు తుడిచిపెట్టుకుపోతారు. రక్తం ఏరులై పారుతుంది. అంతమంది చనిపోవడంతో అందరిలో నిర్లిప్తత ఆవహిస్తుంది. కౌరవుల మరణాన్ని చూసిన గాంధారి శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతరించాలని శపిస్తుంది. తన వారి మరణానికి కారణమైన విష్ణువు నాశనం కావాలని కోరుకుంటుంది.
మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు 36 ఏళ్ల పాటు తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ద్వారకలోనే ఉండి తన భార్యలతో హాయిగా ఉంటాడు. ఒకరోజు మహర్షులంతా శ్రీకృష్ణుడిని కలవాలని ద్వారకకు వస్తారు. అప్పుడు జాంబవతి కుమారుడు సాంబుడు ఓ గర్భిణీ వేషం వేసుకుని వచ్చి తన కడుపులో ఉన్నది అబ్బాయా? అమ్మాయా? చెప్పాలని మహర్షులను కోరతాడు. దివ్యదృష్టితో చూసిన మహర్షులు నీ కడుపు నుంచి ముసలం పుడుతుంది. అది నీ వంశాన్ని నాశనం చేస్తుందని శపిస్తారు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు సాంబుడి నుంచి పుట్టిన రోకలిని అరగదీయాలని చెబుతాడు. దీంతో వారు దాన్ని అరగదీసి అరగదీసి అలసిపోతారు. చిన్న ముక్క మిగిలడంతో దాన్ని సముద్రంలో పారేస్తారు. అది ఓ వేటగాడికి దొరుకుతుంది. దీంతో వాడు దాన్ని బాణంలా తయారు చేసుకుంటాడు. ఇక శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది. తన జన్మ ఇక చాలించాలని తెలుసుకుంటాడు. తన అస్త్ర శస్ర్తాలను వదిలి ప్రభాస తీర్థానికి చేరుకుని అస్త వృక్షం కింద నిష్క్రమిస్తాడు. దీంతో వేటగాడు శ్రీకృష్ణుడి కాలు వేలును చూసి జింకగా భావించి బాణం వేస్తాడు.
Also Read: politics of the state: మునుగోడులో సం”కుల” సమరం
విషం పూసిన బాణం కావడంతో శ్రీకృష్ణుడు అక్కడే మరణిస్తాడు. ఆ బాణం వేసింది ఎవరో కాదు. రామావతారంలో రాముడి చేత చంపబడిన వాలి. అంతడి పేరు నిశాదుడు. శ్రీకృష్ణుడు కనబడకపోవడంతో అర్జునుడు అంతా వెతుకుతాడు. అప్పుడు చెట్టుకింద విగత జీవిగా పడి ఉన్న శ్రీకృష్ణుడి పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. అప్పుడు ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. ఇది క్రీస్తు పూర్వం 3102 ఫిబ్రవరి 17న జరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడి మరణం గురించి చాలా మందికి తెలియదు. దేవుడి మృతిపై కూడా మిస్టరీగా మారడం తెలిసిందే. దీంతో శ్రీకృష్ణుడి మరణంపై పలు రకాల అనుమానాలు కూడా అందరిలో వస్తున్నాయి.