KCR National Politics: దేశంలో పాలన బాగోలేదని గాడిలో పడాలంటే మరో ఫ్రంట్ రావాలని చెప్పిన కేసీఆర్.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. అనంతరం శరద్ పవార్‌తో సైతం భేటీ అయ్యారు. కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత ఇక తాజాగా ఢిల్లీ టూర్ లో ఉన్న కేసీఆర్.. అక్కడి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ కాలేదు. దీంతో సదురు పార్టీ నేతలకు కోపం వచ్చినట్టుంది. అందుకే ఉండబట్టలేక ఆప్ పార్టీ నేత సోమనాథ్ భారతి కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సందించారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అనేక ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది న్యాయనిపుణులతో సంప్రదించేందుకు అని తెలిపారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.
రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. తర్వాత సదరు ఎంపీ సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌తో భేటీ అయ్యారు. దీని వెనక ఏదో జరుగుతోందనే సందేహాన్ని ఆప్ నేత వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థులను, ఉద్యమకారులకు కేసీఆర్ మోసం చేశారంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణలోని అన్ని పథకాల్లో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయవడం ఖాయమన్నారు.
Also Read: బీజేపీ నేతలపై కేసులు..? టీఆర్ఎస్ ది కుట్రపూరితమేనా?
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కేసీఆర్‌పై ఒక్క మాట మాట్లాడని ఆప్ నేతలు ప్రస్తుతం ఈ రేంజ్ లో విరుచుకుపడటం మొదటి సారి అనే చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ అవినీతిపై తొందరలోనే విచారణ జరుగుతుందని బీజేపీ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఆప్ నేతలు సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ నేత కామెంట్స్‌తో తెలంగాణలోనూ చర్చలు మొదలయ్యాయి. అవినీతిపై విచారణ జరిపిస్తే దానిని ఎదుర్కొనేందుకే కేసీఆర్ న్యాయనిపుణులతో ముందుగానే సంప్రదింపులు జరిపారా? అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.
కేసీఆర్ అవినీతి భారీ మొత్తంలో ఉందని మొదటి నుంచీ బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. దీనికి ప్రస్తుతం ఆప్ నేత కామెంట్స్ సైతం ఈ అంశంపై తోడవడంతో మరింత ఆసక్తి నెలకొంది. మరి ఆప్ నేత కామెంట్స్ పై టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తారా? లేదంటే వినీ విననట్టుగానే ఉంటారా? అనేది తెలియాలి. ఇదిలా ఉండగా ఇన్ని రోజులు థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నోరుమెదపని కేసీఆర్.. ప్రస్తుతం ఎలాంటి ఫ్రంట్ లేదని ఏదైనా నిర్ణయం తీసుకుంటే చెబుతామని వెల్లడించడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే ఫ్రంట్ ఏర్పాటు విషయంలో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
Also Read: అమరావతి సాకారం వెనుక ‘బీజేపీ-జనసేన’
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Aam aadmi party leader sensational comments on kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com