Aadhi Pinisetty: హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్లాప్ ల పరంపరలో గత కొన్నేళ్లుగా కొట్టుమిట్టాడుతూ మధ్యలో అడపదడపా ప్రత్యేక పాత్రల్లో రాణిస్తున్నాడు అతను. తెలుగు తెర పై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు. పవర్ స్టార్, ఐకాన్ స్టార్ లాంటి బలమైన హీరోల ముందు కూడా తన నటనతో నిలబడిన టాలెంట్ అతనిది. అలాంటి హీరో హఠాత్తుగా తనకు పెళ్లి అంటూ తనకు కాబోయే భార్యతో కలిసి ఒక ఫోటో దిగి తన సన్నిహితులకు పంపాడు.
ఆ హీరోగారు సడెన్ గా తన సతీమణిని పరిచయం చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఆమె గారు ఒక హీరోయిన్. అసలు హీరో – హీరోయిన్ పెళ్లి అంటే ఎలా ఉండాలి ? ముఖ్యంగా ఆర్భాటాలు, హడావుడి ఏ స్థాయిలో ఉండాలి ? కానీ, చివరకు హీరోహీరోయిన్ల పెళ్లి మీడియాలో కూడా కథనాలు రాలేదు.
Also Read: మనల్ని గెలిపించడానికి చిరంజీవి గారు తగ్గారు – రాజమౌళి
ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే.. ఆది పినిశెట్టి. మరి హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ? నిక్కీ గల్రాని. ఎక్కడో విన్నట్లు ఉంది కదా. చిన్నాచితకా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడానికి నానా పాట్లు పడింది. అయితే, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిందిలే గానీ, ‘ఆది’ని మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆది చాలా కాలంగా నిక్కీ గల్రానితో డేటింగ్ లో ఉన్నాడు. అయితే, వీరిద్దరూ డేటింగ్ కి ముగింపు పలికి ఒక్కటి కాబోతున్నారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఎంగేజ్ మెంట్, మే నెలలో పెళ్లి ఉండబోతుంది అని టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరి ప్రేమకు ఇరువైపులా పెద్దలు నుంచి అంగీకారం వచ్చిందట. గతంలో ఆది – నిక్కీ కలిసి 2015లో ‘మలుపు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతూ ఉంది.
మరి, ఈ హీరో – హీరోయిన్ లిద్దరూ తమ పెళ్లి తంతును ఎలా ముగిస్తారో చూడాలి. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు పెళ్లి లాంటి ముఖ్యమైన ఘట్టాలకు కూడా సింపుల్ గా శుభం కార్డు పలికేస్తున్నారు. సహజంగా నచ్చిన వారితో సహజీవనం, ఆ తర్వాత కూడా నచ్చితే వివాహం వరకు వెళ్తుంది వ్యవహారం.
ఒక్కోసారి ఆ వ్యవహారం వచ్చే లోపే.. కొంతమంది నటీనటులు ఏకంగా పిల్లలకు కూడా జన్మను ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత తీరిగ్గా వివాహం చేసుకుని.. మాకు పెళ్లి అయిపోయిందోచ్ అని ఒక చిన్న స్టేట్ మెంట్ పడేస్తున్నారు. కానీ, తాను అలా చేయను అంటుంది నిక్కీ. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అసలు ‘నిక్కీ గల్రాని’ ఎవరో కాదు, కన్నడ హీరోయిన్ సంజన గల్రానికి స్వయానా చెల్లెలు.
Also Read: ‘ఎన్టీఆర్ – చరణ్’ల పై రాజమౌళి క్రేజీ కామెంట్స్
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Aadhi pinishetty marries heroine nikki galrani
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com