Bhagyashri Borse: రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో తన అందంతో కుర్రకారులను పిచ్చెక్కిపోయేలా చేయడమే కాకుండా, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కదిలించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే . మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి వచ్చిన ఈ కుర్ర హీరోయిన్ మొదటి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన కింగ్డమ్ , కాంతా , ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాలు కూడా పెద్ద ఫ్లాప్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘లెనిన్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమా , ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.
అయితే రీసెంట్ గా ఈమె అభిమానులతో సంభాషిస్తూ చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన జీవితం లోని చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నేను లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేను చిన్నతనం లో ఉన్నప్పుడు మా నాన్న ఒక్క చిన్న ఉద్యోగం కోసం బ్రతిమిలాడడం చూసి చాలా మనస్తాపానికి గురయ్యాను. ఆరోజే నేను నిర్ణయించుకున్నాను , మా నాన్న ని తల ఎత్తుకునేలా చేస్తానని. అందుకోసం చాలా కష్టపడ్డాను , ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అంతే కాదు , ఈమె సినీ ఇండస్ట్రీ లోకి రావడం ఆమె తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదట. ఈ విషయం గురించి కూడా చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది భాగ్యశ్రీ.
ఆమె మాట్లాడుతూ ‘సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కి ఎదురయ్యే సంఘటనలు చూసి , మా ఇంట్లో వాళ్ళు నేను సినీ రంగం లోకి వెళ్తానంటే ఒప్పుకోలేదు. కానీ నేను మా అమ్మ మాట కాదని ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మ, నన్ను అన్నిట్లోనూ బ్లాక్ చేసింది. దాదాపుగా 6 నెలల వరకు ఆమె నాతో మాట్లాడలేదు. కానీ నేను బలంగా నమ్మాను, సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి విజయం సాధించిన తర్వాత కచ్చితంగా వాళ్ళని గర్వపడేలా చేయగలను అని , అదృష్టం కొద్దీ నేను ఇండస్ట్రీ లో నెగ్గుకురాగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ బోర్స్. ‘హానెస్ట్ టౌన్ హాల్ ‘ అనే ఛానల్ లో చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
