Pakistan Army Chief Asim Munir : ఇది మామూలు ట్రోలింగ్ కాదు. మామూలు ర్యాగింగ్ అంతకంటే కాదు. తిట్టకుండా.. కొట్టకుండా.. చుక్కలు చూపిస్తున్నారు. ఆ ఫోటోలు.. వీడియోలు చూస్తుంటే కళ్ళలో నుంచి కన్నీళ్లు కాదు రక్తం కారుతోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో ఏ దేశ రాజకీయ నాయకుడు గానీ.. ఆర్మీ అధిపతి గాని ఈ స్థాయిలో నిరసనలు ఎదుర్కోలేదు. ఈ స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కోలేదు.
కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాతో దగ్గరగా ఉంటున్నాడు. అమెరికా కోసం రకరకాల పనులు చేస్తున్నాడు. తమ దేశంలో ఉన్న విలువైన ఖనిజ వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించడానికి మునీర్ వెనకాడ లేదు. తన పదవి కోసం పాకిస్తాన్ ప్రయోజనాలను అమెరికా ముందు తాకట్టు పెట్టాడని మునిర్ మీద విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అతడు తన ధోరణి మార్చుకోవడం లేదు. పైగా అమెరికాతో మరింత దారుణంగా అంట కాగుతున్నాడు
మునిర్ వ్యవహార శైలి మీద అక్కడి పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అమెరికాతో ఆ స్థాయిలో అంట కాగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.. మునీర్ తన ధోరణి మార్చకపోతే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.. అవి అలా సాగుతుండగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు మునీర్ భవితవ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలో నెట్టాయి.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు మునీర్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో అతడు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు తన భార్య ఉష తో మునీర్ ను పోల్చారు. దీంతో మునీర్ ఆనంద పరవశుడయ్యాడు. ఫలితంగా సోషల్ మీడియాలో మునీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉష ఉండగానే వాన్స్ మునీర్ ను రెండవ వివాహం చేసుకున్నాడని చాలామంది కృత్రిమ ఫోటోలను రూపొందిస్తున్నారు. ఇదే సమయంలో అవసరానికి కాళ్లు పట్టుకోవడం.. ఆ తర్వాత జాడిచ్చి తన్నడం అమెరికాకు అలవాటేనని సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మునిర్ మీద ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ ఒక్క పాకిస్తాన్ జాతీయుడు కూడా వ్యతిరేకించకపోవడం ఇక్కడ విశేషం.
