Telangana Liquor Market: తెలంగాణలో మద్యం అమ్మకాలు మార్కెట్‌లో విస్కీ ఏకపక్ష ఆధిపత్యం కొనసాగిస్తోంది. గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతీ 10 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో 9 బాటిళ్లు విస్కీవే అని తెలుస్తోంది. ఇది రాష్ట్ర మద్యం మార్కెట్‌లో విస్కీ ఎంత బలమైన స్థానం సంపాదించిందో స్పష్టం చేస్తోంది. మార్కెట్ వాటాలో విస్కీ 88 నుంచి 90 శాతం షేర్ ఉంది. బ్రాండీ 9.2 శాతం, వోడ్కా 1.24 శాతం, వైన్ 0.88 శాతం, రమ్ 0.32 శాతం, జిన్ 0.09 శాతం షేర్ ఉన్నాయి.
రెండో స్థానంలో బ్రాందీ…
విస్కీ తర్వాత బ్రాందీ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, విస్కీతో పోలిస్తే దాని వాటా చాలా తక్కువగా ఉంది. వోడ్కా, వైన్, రమ్, జిన్ వంటి ఇతర మద్యాలు కలిపినా విస్కీ మార్కెట్ ఆధిపత్యానికి సవాలు విసిరే స్థాయిలో లేవు.
వీస్కీకి ఎందుకు డిమాండ్?
విస్కీ మధ్యం ప్రియుల ఎంపికగా మారడానికి ప్రధాన కారణం సామాజిక జీవనంలో దాని భాగస్వామ్యం. పార్టీలు, స్నేహితులతో సమావేశాలు, కార్పొరేట్ ఈవెంట్స్, పండగలు వంటి సందర్భాల్లో విస్కీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మీడియం, ప్రీమియం సెగ్మెంట్ బ్రాండ్లకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. వినియోగదారులు నాణ్యత, రుచి, స్టేటస్‌ను దృష్టిలో ఉంచుకుని విస్కీని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మద్యం వినియోగంలో మార్పు..
తెలంగాణలో విస్కీ ఆధిపత్యం కేవలం ఒక ట్రెండ్ కాదు. ఇది రాష్ట్రంలో మద్యం వినియోగం సంస్కృతిలోనే మార్పును సూచిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో మధ్య తరగతి వినియోగం పెరగడం, ఆధునిక లైఫ్‌స్టైల్‌లో మద్యం భాగం కావడం వంటి అంశాలు విస్కీ అమ్మకాలు పెరగడానికి దోహదపడ్డాయి. అయితే, ఇతర మద్యాలు మార్కెట్ షేర్ చాలా తక్కువగా ఉండటం ఆసక్తికరం. ఇది తెలంగాణ మద్యం వినియోగదారులు ఇంకా సంప్రదాయ రుచుల వైపే మొగ్గు చూపుతున్నారని తెలియజేస్తోంది.
తెలంగాణ మద్యం మార్కెట్‌లో విస్కీ పట్టుతప్పని ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రతీ 10 బాటిళ్లలో 9 విస్కీ అమ్ముడవడం దీనికి సాక్ష్యం. మీడియం, ప్రీమియం సెగ్మెంట్‌లోని బ్రాండ్లకు ఉన్న డిమాండ్ రాబోయే రోజుల్లో కూడా విస్కీ ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

