Homeక్రైమ్‌Coimbatore Crime News: పదేళ్ల బాలికపై అఘాయిత్యాన్ని మర్చిపోకముందే.. కోయంబత్తూర్ లో మరో దారుణం

Coimbatore Crime News: పదేళ్ల బాలికపై అఘాయిత్యాన్ని మర్చిపోకముందే.. కోయంబత్తూర్ లో మరో దారుణం

Coimbatore Crime News: తమిళనాడులో కోయంబత్తూర్ లోని ఇటీవల ఓ 10 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని కలిగించింది. దీనిని మర్చిపోకముందే ఇప్పుడు అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది.. దీంతో జాతీయ మీడియాలో కోయంబత్తూరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కోయంబత్తూర్ లో తొండ ముత్తూరు ప్రాంతంలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందని పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నివాసం మీద పెట్రోల్ బాంబు విసిరేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అవి కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. సుదీర్ఘ నేరచరిత్ర కలిగిన అతడిని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

చెన్నై నగరానికి చెందిన కార్తీక్ అలియాస్ మరియు అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక ప్రైవేట్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అతడు ప్రేమించమని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే ఆమె అతని ప్రేమను ఒప్పుకోవడం లేదు. ఇటీవల ఆమెను అనుసరించి ఇబ్బంది పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి మీద ఆగ్రహాన్ని పెంచుకున్న కార్తీక్.. తన స్నేహితుడు సహాయంతో బైక్ మీద ప్రయాణిస్తూ.. ఆ అమ్మాయి ఇంటి మీద పెట్రోల్ బాంబు విసిరేశాడు.. అంతకుముందు ఆ యువతి ఇంటి మీదకి వచ్చాడు. ఆమె తండ్రిని రాయడానికి వీళ్లేని భాషలో దూషించాడు. అంతేకాదు చంపుతానని బెదిరించాడు. పెట్రోల్ బాంబు విసిరేయడంతో ఆ ప్రాంతంలో మంటలు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కార్తీక్ మీద తమిళనాడు వ్యాప్తంగా 31కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. అతడు అనేక సందర్భాలలో జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఆ యువతి ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసిన నేపథ్యంలో పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. మరోవైపు మహిళల భద్రతకు తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన నేపథ్యంలో.. కార్తీక్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉందని తమిళనాడులో చర్చ జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular