Liver Detox Myths: మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అవయవాల్లో కాలేయం అత్యంత ముఖ్యమైనది.. దీనిని మన శరీరంలో కర్మాగారం అని పిలుస్తుంటారు. హృదయం, మూత్రపిండాల స్థాయికి మించి ఇది పనిచేస్తూ ఉంటుంది. కాలేయం గనుక పని చేయకుండా ఉంటే.. శరీరం రోగాల కుప్ప అవుతూ ఉంటుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే మూత్రపిండాల పనితీరులో మార్పు వస్తుంది. గుండె పనితీరులో కూడా మార్పు వస్తుంది. కానీ కాలేయం మాత్రం పనితీరులో ఎటువంటి మార్పులు చూపించదు. విపరీతమైన సమస్యలు వస్తేనే కాలేయం ఇబ్బంది పడుతూ ఉంటుంది.
కాలేయం ముందుగానే చెప్పినట్టు మన దేహానికి ఒక కర్మాగారం లాంటిది.. బాడీలో ఉన్న చెడు పదార్థాలను మొత్తం శుద్ధి చేస్తుంది. వాటిని తొలగిస్తుంది కూడా. అయితే కొందరు లివర్ ను డిటాక్స్ చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అందువల్ల కొన్ని కొన్ని పదార్థాలను తీసుకోవాలని చెబుతుంటారు. ఇక మార్కెట్లో అయితే అనే కంపెనీలు ఉత్పత్తులను అమ్ముతుంటాయి. వీటిని వాడితే మీ లివర్ డిటాక్స్ అవుతుందని చెబుతుంటాయి. వైద్యుల పరిశోధన ప్రకారం లివర్ డిటాక్స్ అనేది పూర్తిగా అబద్ధం. పైగా ఏ పదార్థం కూడా లివర్ ను డిటాక్స్ చేయదు.
లివర్ అనేది ఒక రసాయన కర్మాగారం లాంటిది. దీనిని డిటాక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేక రకాల పదార్థాలు.. ఔషధాలకు సంబంధించిన విషాలను తగ్గిస్తుంది. శరీరం నుంచి వెంటనే తొలగిస్తుంది. పైగా కొవ్వులో కరిగే ఆ విషాలను, నీటిలో కరిగే విధంగా మార్చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మార్కెట్లో లివర్ డిటాక్స్ ఉత్పత్తులు పూర్తిగా అటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉండవు. అవి లివర్ ఎంజాయ్ పనితీరును నేరుగా ప్రభావితం చేయగలిగితేనే ఆ స్థాయి ఉంటుంది. డిటాక్స్ ఉత్పత్తులు చెప్పుకునే స్థాయిలో ప్రభావాన్ని చూపించలేదు. ఏదో హెర్బల్ టీ తాగినంత మాత్రాన మన లివర్ ఒక్కసారిగా ప్రభావంతంగా మారిపోదు. మరింత గొప్పగా విషాలను హరించలేదు. దీనికంటే ముందు నుంచే వారంలో ఏడు రోజులు.. రోజులో 24 గంటలు లివర్ రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటుంది. అందులో ఉన్న వ్యర్ధాలను బయటికి పంపిస్తూనే ఉంటుంది.
ఈ కథనం వివిధ వేదికల వద్ద సేకరించాం. దీనిని వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయంగా చూడకూడదని మా మనవి. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ కథనాన్ని పబ్లిష్ చేశాం. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలని కోరుతున్నాం.
