Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి క్యారెక్టర్రైజేషన్ లో కొంచెం ఎక్కడో లోపాలు కనిపిస్తున్నాయనే విమర్శలైతే వస్తున్నాయి. ఇక ఎది ఏమైనా కూడా పెద్ది ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం మేకర్స్ కి కొంతవరకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే పెద్ది క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఒదిగిపోయి నటించారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ ఎలాగైతే హైలెట్ అయిందో పెద్దిలో పెద్దిరాజు క్యారెక్టర్ కూడా అద్భుతంగా నిలుస్తుందని బుచ్చిబాబు సనా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది. గత సంవత్సరం ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన పెద్ది సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక ఈ సినిమా సైతం అనుకున్న రేంజ్ లో ఆడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా 2000 కోట్ల మార్కును టచ్ చేసినట్లయితే రామ్ చరణ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా కాకుండా సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన కూడా రామ్ చరణ్ మార్కెట్ మరింత తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. బుచ్చి బాబుకి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.
దీనిని సరిగ్గా వాడుకున్నట్టయితే మాత్రం ఆయన టాప్ డైరెక్టర్ గా మారతాడు. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్స్ ని రాబడటం కష్టమని కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మీద మొన్నటిదాకా హైప్ క్రియేట్ అవ్వలేదు.
నిన్న ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో కొంతవరకు సినిమా మీద ఊపైతే వచ్చింది. కానీ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు సైతం చెబుతున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ టాక్ వస్తేనే సినిమాకి ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మాత్రం ఆ కలెక్షన్స్ కూడా రావని వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతుండటం విశేషం…
