Ishan Kishan Viral Video: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచి చూపించింది. ఇషాన్ కిషన్ వీరోచితమైన హాఫ్ సెంచరీ తో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. బెంగళూరు తో జరిగే మ్యాచ్ తో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.
చెన్నై మైదానంలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్, అభిషేక్ శర్మ తమ స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. జట్టు భారాన్ని అతడు మోసాడు. చెన్నై బౌలర్ల బౌలింగ్ లో ఒక ఆట ఆడుకున్నాడు.. అద్భుతమైన హాఫ్ సెంచరీ ద్వారా జట్టును గెలిపించిన ఇషాన్ కిషన్ మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అదుకున్నాడు.
హైదరాబాద్ జట్టు గెలిచిన తర్వాత కిషన్ చెన్నై జట్టు ట్రేడ్ మార్క్ నినాదమైన విజిల్ పోడు ను అనుకరించాడు. తన ఉత్సాహాన్ని ఆపుకోలేక సెలబ్రేట్ చేసుకున్నాడు. చెన్నై అభిమానులు మీరు మైదానం నుంచి వెళ్లిపోండి అంటూ సైగలు చేశాడు. ఇది చెన్నై అభిమానులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. కిషన్ మీద చెన్నై అభిమానులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. దానిని వారు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.
“ఇది గేమ్ స్పిరిట్ కు పూర్తి విరుద్ధం. అతడు అలా చేయడం ఏమాత్రం బాగోలేదు. పైగా మమ్మల్ని మైదానం నుంచి బయటికి వెళ్లిపోమని సైగలు చేశాడు. అతడు హైదరాబాద్ జట్టుకు ఆడటం ఇది రెండవ సీజన్ మాత్రమే. చెన్నై జట్టు ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పటికైనా అతడు హద్దులో ఉండాలని” చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఆమధ్య చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కిషన్ ఆడుతుంటే ఎల్లో ఆర్మీ అభిమానులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని.. అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. అందువల్ల కిషన్ ఇప్పుడు రివేంజ్ తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో న్యూట్రల్ ఆడియన్స్ పేర్కొంటున్నారు. అతడిని గెలకడం వల్లే.. ఇప్పుడు ఈ స్థాయిలో కిషన్ రివెంజ్ తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో వారు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కిషన్ విజిల్ పోడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.
Wait for ,Ishan Kishan iconic Whistle Podu celebration at Chepauk. #CSKvsSRH #IshanKishan pic.twitter.com/zDhiaqICv3
— Faruk (@uf2151593) May 18, 2026
