Homeఎంటర్టైన్మెంట్Rashmika live event controversy: లైవ్ ఈవెంట్ లో బూతులు మాట్లాడిన హీరోయిన్ రష్మిక.. షాక్...

Rashmika live event controversy: లైవ్ ఈవెంట్ లో బూతులు మాట్లాడిన హీరోయిన్ రష్మిక.. షాక్ లో హీరో, డైరెక్టర్..

Rashmika live event controversy: సౌత్ నుండి నార్త్ వరకు యూత్ ఆడియన్స్ దగ్గర నుండి అన్ని వర్గాల ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మందాన. ఈమె కెరీర్ ని ‘పుష్ప’ కి ముందు , ఆ తర్వాత అని విభజించవచ్చు. ‘పుష్ప’ కి ముందు కేవలం సౌత్ లో మాత్రమే ఈమెకు పాపులారిటీ , క్రేజ్ , ఫాలోయింగ్ ఉండేది. కానీ ‘పుష్ప’ తర్వాత ఈమె రేంజ్ పాన్ ఇండియా కి చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె ఒప్పుకున్నా బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ కూడా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన ‘చావా’ , ‘పుష్ప 2’ చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి.

ఇకపోతే రీసెంట్ గా ఆమె బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2’ అనే చిత్రం చేసింది. షాహిద్ కపూర్ ఇందులో హీరో గా నటించగా, కృతి సనన్ మరో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా , మేకర్స్ అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. నిన్న ముంబై లో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో మూవీ టీం తో కలిసి పాల్గొన్న రష్మిక, కృతి సనన్ గురించి మాట్లాడుతూ ‘ఆమె ఈ చిత్రం లో చాలా హాట్ గా ఉంది’ అంటూ , ఒక అడల్ట్ బూతు పదాన్ని కూడా ఉపయోగించింది. ఆ తర్వాత వెంటనే ‘అయ్యో సారీ’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు, కృతి సనన్ అయితే సిగ్గు తో తలదించుకుని నవ్వేసింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ పుణ్యమా అని రష్మిక కూడా బాగా బోల్డ్ గా తయారైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రష్మిక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేయడానికి ఒప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి’ అనే చిత్రం చేస్తోంది , ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రం లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఆమె పూర్తి స్థాయి విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. వీటితో పాటు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో కూడా నటిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular