Pavala Shyamala: నేడు ఉదయం నిద్రలేవగానే , మన టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్ పావలా శ్యామల పరిస్థితి చూసి కంటతడి పెట్టుకొనే ఉండుంటాము. ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్న పావలా శ్యామల, దిక్కు తోచని అనాధ లాగా, కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద సైడ్ ప్లాట్ ఫార్మ్ వద్ద కూర్చోవడం, ఆమె దయనీయమైన పరిస్థితి ని చూసిన స్థానికులు , వెంటనే పోలీసులకు సమాచారం అందించడం , పోలీసులు ఆమెని ఫౌండేషన్ కి పంపించడం వంటివి జరిగాయి. సోషల్ మీడియా లో దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో, ఎవరైనా సినీ ప్రముఖులు స్పందించి , ఈమెకు సహాయం చేస్తే బాగుటుందని కోరుకున్నాం. సరిగా అదే జరిగింది , ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించి , పావలా శ్యామల కి ఆర్ధిక సాయం అందించాడు.
పావలా శ్యామల ని , ఆమె కూతుర్ని ఒక రూమ్ కి తరలించి , వారికి అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాడు. దీంతో పావలా శ్యామల దిల్ రాజు కి కృతఙ్ఞతలు తెలియజేసింది. అనంతరం ఆమె కూతురు మాట్లాడుతూ దిల్ రాజు గారు చేసిన మేలుని మేము జీవితం లో ఎప్పటికీ మరచిపోలేము , రాజు గారికి మా కష్టం చెప్పుకుంటే కచ్చితంగా సహాయం చేస్తాడని మా అమ్మ ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. మా కష్టాలు ఇప్పటికీ మీ దృష్టికి వచ్చాయి , మీరు మాకు దేవుడితో సమానం అంటూ పావలా శ్యామల కూతురు చెప్పుకొచ్చింది. దిల్ రాజు చేసిన ఈ సహాయం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా వరకు దిల్ రాజు పై ఎక్కువగా నెగెటివిటీ ఉంటుంది. కానీ ఈ ఒక్క సంఘటన తో ఆయన నెటిజెన్స్ దృష్టిలో హీరో అయిపోయాడు .
