spot_img
Homeఎంటర్టైన్మెంట్Suriya remake of Mahesh Babu movie: మహేష్ బాబు సినిమాను రీమేక్ చేయాలని చూసిన...

Suriya remake of Mahesh Babu movie: మహేష్ బాబు సినిమాను రీమేక్ చేయాలని చూసిన సూర్య..కానీ వర్కౌట్ కాలేదుగా..

Suriya remake of Mahesh Babu movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు మహేష్ బాబు…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ సక్సెస్ లను సాధించిన ఆయన ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీద 100% ఎఫర్ట్స్ పెట్టి నటిస్తున్నాడు. చాలా సన్నివేశాల్లో డూప్ లేకుండానే నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రాజమౌళి పెట్టే టార్చర్ ని భరిస్తూ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ విషయంలో మహేష్ బాబు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక వారణాసి సినిమా ఇప్పటికే 40% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

కాబట్టి ఈ సినిమా నుంచి మరొక టీజర్ ని వదిలితే బాగుంటుందని రాజమౌళి అభిమానులు, ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళం లో సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో రిలీజ్ చేసి చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు సూర్య… తమిళ్ సినిమా ఇండస్ట్రీ నటుడు అయినప్పటికి తెలుగులో అతనికి చాలా మంచి క్రేజ్ ఉంది.

ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాని తమిళంలో సూర్య రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమాను విజయ్ రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే పోకిరి మూవీ కావడం విశేషం…

ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమాని మొదట సూర్య చేయాలనుకున్నాడు. కానీ విజయ్ అంతకుముందే వేరే ఒక ప్రొడ్యూసర్ తో సినిమా రైట్స్ ని తీసుకొని తనే హీరోగా ఈ సినిమాని చేయడం అప్పట్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. నిజానికి సూర్య కనక ఈ సినిమా చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular