Homeఆంధ్రప్రదేశ్‌Bandla Ganesh Daughter Engagement: బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్.. చంద్రబాబు కాళ్లు మొక్కబోయిన ఎర్రబల్లి...

Bandla Ganesh Daughter Engagement: బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్.. చంద్రబాబు కాళ్లు మొక్కబోయిన ఎర్రబల్లి దయాకర్ రావు.. వైరల్ వీడియో

Bandla Ganesh Daughter Engagement: రాజకీయాలలో పరిణామాలు ఏ విధంగానైనా మారుతూ ఉంటాయి. రాజకీయాలు స్థిరంగా ఉంటే వాటిని ఎవరూ పరిగణలోకి తీసుకోరు. రాజకీయ నాయకులు చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి అవకాశాల కోసం మాత్రమే అడుగులు వేస్తుంటారు. అందువల్లే స్మశానం ముందు ముగ్గు ఉండదు. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు అనే డైలాగ్ పుట్టింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. జరిగిన సంఘటన అటువంటిది కాబట్టి..

తెలుగు రాష్ట్రాల్లో పేరుపొందిన నిర్మాత, పౌల్ట్రీ వ్యాపారవేత్త బండ్ల గణేష్.. అతని కుమార్తె వివాహా నిశ్చయ తాంబూలాల వేడుక ఆదివారం జరిగింది.. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు.. సినీ ప్రముఖులు.. ఇతర కీలక వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బండ్ల గణేష్ ఉభయ కుశలోపరిలాంటి వ్యక్తి. అతనికి విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. అందువల్లే అందరు వ్యక్తులు అతడు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఖచ్చితంగా హాజరవుతుంటారు.

బండ్ల గణేష్ కు, మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకు ఎప్పటినుంచో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దయాకర్ రావు కుటుంబం పౌల్ట్రీ వ్యాపారంలో ఉంది. దయాకర్ రావు సోదరుడు ఎర్రబల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్రంలో పేరుపొందిన పౌల్ట్రీ వ్యాపారి. ఈయనకు ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.. బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు దయాకర్ రావు కూడా హాజరయ్యారు. చంద్రబాబు కార్యక్రమానికి హాజరవుతున్నప్పుడు.. దయాకర్ ఎదురుపడ్డారు. చంద్రబాబుతో మాట్లాడారు. ఆయన కాళ్లు మొక్కడానికి ప్రయత్నించారు. చంద్రబాబు వద్దని వారించారు.

దయాకర్ రావు తన రాజకీయ జీవితాన్ని టిడిపి తో మొదలుపెట్టారు. నాడు ఓటుకు నోటు కేసులో తెర వెనుక వ్యవహారం నడిపింది దయాకర్ రావని ఇప్పటికి చెబుతుంటారు. నాడు రేవంత్ రెడ్డి ఏసీబీ పోలీసులకు దొరికి పోవడానికి దయాకర్ రావు కారణమని అంటుంటారు. ఆ తర్వాత దయాకర్ రావు గులాబీ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు.. 2023 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. అంతటి తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు కూడా దయాకర్ రావు పార్లమెంట్ సభ్యుడిగా.. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించలేకపోయారు. ఇప్పటికీ దయాకర్ రావు, రేవంత్ రెడ్డికి ఆ గ్యాబ్ అలానే కొనసాగుతోంది. దయాకర్ రావు అల్లుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.. రాజకీయాలలో ఏవైనా జరుగుతాయి. అందువల్లే వాటిని రాజకీయాలు అంటారని విశ్లేషకులు చెబుతుంటారు. అది నిజమేనని చంద్రబాబు, దయాకర్ రావు ఘటన నిరూపించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular