Pradeep Ranganathan LIK OTT : వరుసగా మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకొని , యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) స్పీడ్ కి ‘LIK’ చిత్రం పెద్ద బ్రేక్ వేసింది. ఏప్రిల్ 10 న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ప్రదీప్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి 70 కోట్ల రూపాయిల రేంజ్ క్లోజింగ్ వసూళ్లు వచ్చాయి , సూర్య , విక్రమ్, ధనుష్ , విజయ్ సేతుపతి వంటి స్థిరమైన మార్కెట్ ఉన్న సీనియర్ హీరోలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఈమధ్య కాలంలో రావడం లేదు. అలాంటిది నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రదీప్ ఫ్లాప్ టాక్ తో కూడా ఈ రేంజ్ గ్రాస్ ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రదీప్ రంగనాథ్ ప్రతీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేది, కానీ మొట్టమొదటిసారి ప్రదీప్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఈ నెల 6 వ తేదీ నుండి తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మరి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే 2040 వ సంవత్సరం టెక్నాలజీ మనుషులను కంట్రోల్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు, ఇద్దరి ప్రేమికుల మధ్య పుట్టిన ప్రేమ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ విగ్నేష్ శివన్. ఈ చిత్రం లో హీరోయిన్ మొబైల్ పిచ్చిది. నిద్ర లేస్తే దాంతోనే సావాసం , తన లైఫ్ పార్టనర్ ని కూడా ‘LIK ‘ అనే మొబైల్ యాప్ ద్వారా ఎంచుకుంటుంది. ఆ యాప్ ఏది చెప్తే , అది చేస్తుంది. అలా ఆ యాప్ కారణంగా హీరో హీరోయిన్ మధ్య లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆధారంగా తీసుకొని డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగానే ఉంటుంది , సెకండ్ హాఫ్ చివరి 30 నిముషాలు కాస్త చిరాకు కలిగిస్తుంది. ఓవరాల్ గా టైం పస మూవీ , ఒకసారి కచ్చితంగా చూడొచ్చు.