Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: అవుట్ చేసి.. ఓ రేంజ్ లో సెలబ్రేషన్.. ఇది కదా 15 ఏళ్ల...

Vaibhav Suryavanshi: అవుట్ చేసి.. ఓ రేంజ్ లో సెలబ్రేషన్.. ఇది కదా 15 ఏళ్ల బుడ్డోడి రేంజ్

Vaibhav Suryavanshi: అప్పట్లో సచిన్ ఆడుతున్నప్పుడు.. అతని అవుట్ చేయాలని చాలామంది బౌలర్లు ప్రయత్నించేవారు. ఆ అవకాశం దక్కిన బౌలర్ ప్రపంచాన్ని జయించిన గొప్పగా ఫీల్ అయ్యేవాడు. అంతేకాదు ఆకాశమే హద్దుగా తన ఉత్సాహాన్ని ప్రదర్శించేవాడు. ఎందుకంటే సచిన్ వికెట్ అంత ఈజీ కాదు. అతడు మామూలు ప్లేయర్ కాదు. సచిన్ క్రికెట్ తీస్తే చాలు 1000 వికెట్లు తీసిన ఘనత లభిస్తుందని అక్రమ్ లాంటి బౌలర్ అన్నాడంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అందుకే సచిన్ ను క్రికెట్ గాడ్ అని పిలుస్తుంటారు. సచిన్ ఆడే ఆట.. కొట్టే పరుగులు.. క్రికెట్ల మధ్య రన్ చేసే విధానం.. ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.

సచిన్ తర్వాత క్రికెట్ మీద ఆ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన ఆటగాళ్లు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సచిన్ కూడా మైమర్చిపోయే విధంగా ఆడుతున్నాడు 15 సంవత్సరాల సూర్య వంశీ. టీమిండియా లోకి ఇతడు త్వరలోనే ప్రవేశిస్తాడని వార్తలు వస్తున్నాయి. దానికంటే ముందుగానే సూర్య వంశీ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో రెండు సందర్భాల్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా అవతరించాడు. అంతేకాదు సెంచరీ కూడా చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సూర్య వంశీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఊహించని విధంగా జమీషన్ బౌలింగ్లో క్లీన్ బౌల్ద్ అయ్యాడు. అతని వికెట్ తీసిన తర్వాత జమీషన్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. సూర్య వంశీ ని చూసి గట్టిగా అరిచాడు. జెమీషన్ వయసులో సగం కూడా ఉండని సూర్య వంశీ ఇప్పటికే ఐపీఎల్లో తన స్టామినాను నిరూపించుకున్నాడు. తన రేంజ్ ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. అందువల్లే జమిషన్ అతని వికెట్ తీసిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో నాలుగు పరుగులు చేసినప్పటికీ సూర్య వంశీ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నాడు. 15 సంవత్సరాలు కూడా లేని సూర్య వంశీని ఔట్ చేసి జమిషన్ లాంటి బౌలర్ సెలబ్రేషన్ చేసుకున్నాడు అంటే అతని రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

“అది అతడి ఆట. మామూలుగా అయితే ఈరోజు దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక నిలబడి ఉంటే మ్యాచ్ లో స్కోర్ వేగం మరో విధంగా ఉండేది. అతడు నాలుగు పరుగులు చేసి ఢిల్లీ బౌలర్ కు లైఫ్ ఇచ్చాడు. ఒకవేళ అతడు గనుక అదిరి పోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసి ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular