Dhanush Kara Collections: తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర'(Kara Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తమిళ ఇండస్ట్రీ లో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు, అలాంటి సమయం లో ధనుష్ లాంటి హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి టాక్ కి తగ్గ ఓపెనింగ్ వసూళ్లు అసలు రాకపోవడం గమనార్హం. సరైన రీతిలో పబ్లిసిటీ లేకపోవడం వల్లే , ఈ చిత్రానికి ఓపెనింగ్స్ రాలేదని , కాకపోతే టాక్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు , తమిళ, హిందీ భాషలకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
తమిళ వెర్షన్ నుండి ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 5 కోట్ల 12 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని, తెలుగు వెర్షన్ కి 1 కోటి 23 లక్షల రూపాయిలు వచ్చిందని , ఇక హిందీ వెర్షన్ కి అయితే కేవలం 30 వేల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 6 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి దాదాపుగా 2 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 68 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణంగా విడుదలైన ప్రదీప్ రంగనాథన్ ‘LIK ‘ చిత్రానికి నెగెటివ్ టాక్ మీద 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ధనుష్ చిత్రానికి అంతకంటే తక్కువ వసూళ్లు రావడం గమనార్హం. అయితే ఈ సినిమాపై మొదటి నుండి బజ్ ఏర్పడకపోవడం తో పాటు, వర్కింగ్ డే లో విడుదల అవ్వడం వల్లే , పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్ వసూళ్లు రాలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కనీసం ఫుల్ రన్ లో అయినా ఈ చిత్రం పుంజుకుంటుందా అంటే , బుక్ మై షో యాప్ లో ట్రెండింగ్ చూస్తుంటే కష్టమేనేమో అని అనిపిస్తోంది. ఈ చిత్రానికి అక్కడ గంటకు 6 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. 2 వ రోజు ఇది మంచి ట్రెండ్ కాదనే చెప్పాలి.