Parag Agrawal: టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు. అది ఉన్నవాడు అవకాశాల కోసం ఎదురు చూడడు.. అవకాశాలను సృష్టిస్తాడు. అద్భుతాలు చేస్తాడు. అవసరం ప్రతీ వ్యక్తిలోని టాలెంట్‌ను బయటపడుతుంది. భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ కూడా అవమానం ఎదుర్కొన్న చోటలే అద్భుతం చేశాడు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత అవమానకరంగా అప్పటి వరకు సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు. కానీ పరాగ్ ఇప్పుడు కొత్త అధ్యాయం లిఖించాడు. 2023లో ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించాడు. తాజాగా 100 మిలియన్ డాలర్లు సమీకరించాడు. దీంతో కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లు(సుమారు రూ.19 వేల కోట్లు)కు చేరింది. ఈ విజయం సాంకేతిక నైపుణ్యం, ధైర్యం, వ్యూహాత్మక పెట్టుబడుల సమ్మేళనానికి నిదర్శనం.
పతనం నుంచి పునరుద్ధరణ
ట్విటర్ సీఈవోగా పరాగ్ ప్రపంచప్రసిద్ధి చెందాడు. మస్క్ తొలగించిన తర్వాత ఆయన ఆగిపోలేదు. ఏఐ రంగంలోకి ప్రవేశించి ప్యారలల్ వెబ్‌ను రూపొందించారు. ఈ స్టార్టప్ డేటా ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ వంటి కీలక రంగాల్లో పనిచేస్తోంది. 100 మిలియన్ డాలర్ల ఫండింగ్ వెనుక పెద్ద వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇది భారతీయ సాంకేతికికులు అంతర్జాతీయంగా సత్తా చాటుకుంటున్నారనే సంకేతం. మస్క్ అవమానాన్ని ఇంధనంగా మలిచుకుని ఈ స్థాయి విజయం సాధించడం ప్రేరణాత్మకం.
విజయ వెనుక వ్యూహం
పరాగ్ విజయం యాదృచ్ఛికం కాదు. ట్విటర్‌లో సంపాదించిన అనుభవం, ఏఐ ట్రెండ్‌లను ముందుగా గుర్తించడం కీలకం. ప్యారలల్ వెబ్ స్కేలబుల్ టెక్నాలజీలపై దృష్టి పెట్టి, యూనికార్న్ స్థాయికి చేరింది. భారతదేశంలోని టాలెంట్ పూల్, అమెరికా మార్కెట్‌లో డిమాండ్‌ను సమర్థవంతంగా ఉపయోగించారు. ఈ ఫండింగ్ ఏఐ రంగంలో భారతీయుల ప్రాబల్యాన్ని మరింత బలపరుస్తుంది. స్టార్టప్ విలువ రూ.19 వేల కోట్లకు చేరడం భారతీయ వెంచర్ ఎకోసిస్టమ్‌కు గర్వకారణం.
పరాగ్ విజయం భారతీయ యువతకు మార్గదర్శకం. అవమానాలు, వైఫల్యాలు శాశ్వతం కావు. సరైన నైపుణ్యాలు, దృఢసంకల్పంతో శూన్యం నుంచి సామ్రాజ్యాలు నిర్మించవచ్చు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో భారతీయులు గ్లోబల్ లీడర్లుగా మారుతున్నారు. ప్రభుత్వం, పెట్టుబడిదారులు ఇలాంటి టాలెంట్‌ను మరింత ప్రోత్సహించాలి. మస్క్‌తో పోటీ పడుతూ పరాగ్ చూపిన మార్గం భవిష్యత్ జనరేషన్‌కు ప్రేరణ.