spot_img
Homeబిజినెస్Vivo X300 price: Vivo నుంచి ప్రీమియం ఫోన్.. ధర ఎంతో తెలుసా..

Vivo X300 price: Vivo నుంచి ప్రీమియం ఫోన్.. ధర ఎంతో తెలుసా..

Vivo X300 price: Vivo కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది వచ్చే మే నెలలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే దీని గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ మొబైల్లో ప్రత్యేకంగా కెమెరా పనితీరు నాణ్యతగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉండడంవల్ల రోజువారి వినియోగదారులతో పాటు ప్రత్యేక అవసరాలకు ఉపయోగించేవారికి ఇది బాగా నచ్చుతుందని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్ లో ఉండే ఫీచర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

Vivo కంపెనీ నుంచి మేలో రాబోతున్న కొత్త ఫోన్ X 300. ఈ మొబైల్ లో 6.8 టు అంగుళాల LTPO AMOLED డిస్ప్లే ఉండనుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. పూర్తిగా HDR 10+ సపోర్టు తో పని చేసే ఇందులో అత్యధిక Resolution తో కూడిన డిస్ప్లేను పొందవచ్చు. అలాగే ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండనుంది. మొబైల్ వేగం పెరగాలని అనుకునే వారికి ఈ ప్రాసెస్ బాగా నచ్చుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేసే ఇందులో 12 GB రామ్ సపోర్ట్ చేయనుంది. అలాగే 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనుంది.

ప్రస్తుత కాలంలో మొబైల్ కొనుగోలు చేసేవారు ఎక్కువగా కెమెరా పని తీరుపై ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారికోసం ఈ మొబైల్లో ప్రత్యేకమైన కెమెరాలు సెట్ చేశారు. ఈ కెమెరా 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 50 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ పనిచేయనుంది. సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం 50 MP కెమెరా పనిచేస్తుంది. మీ మొబైల్లో IP 68, IP 69 ఉండడంతో దుమ్ము దూళి నుంచి రక్షణగా ఉంటుంది.

మార్కెట్లోకి రాబోయే వివో ఎక్స్ 300 అల్ట్రా మొబైల్ లో బలమైన బ్యాటరీ ఉండనుంది. ఇందులో 6600 mAh బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయనుంది. ఇందులో 40 W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. బ్లాక్, సిల్వర్, గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉండి ఈ మొబైల్ ధర రూ.1,10,000 ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular