AI: ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఐ టి వంటి విభాగాలు ఉండేవి. కొంతకాలంగా ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. ఇందులో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. కేవలం కంప్యూటర్ సైన్స్ లో చేరుతున్నారు. అందులో కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను మాత్రమే ఇష్టపడుతున్నారు. కేవలం మనదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో అధికం
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఇంటర్ ఫలితాలు వచ్చేసాయి. దీంతో విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష వైపు దృష్టిస్తారించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. దీంతో విద్యార్థులు సాధన కొనసాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ముఖ్యంగా ఎంపీసీ గ్రూప్ చదివిన విద్యార్థులు.. ఇంజనీరింగ్ వైపు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వారిలో చాలామంది బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు.
నేటి కాలంలో కృత్రిమ మేధ అన్ని రంగాలలో విస్తరించింది. అయితే ఇక్కడ బీటెక్ లో ప్రవేశించే విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి ఒకటి తెలుసుకోవాలి. కృత్రిమ మేధ అనేది ఒకే శాఖ కే పరిమితం కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం కోడింగ్ రాయడానికి మాత్రమే పరిమితం కాదు. సమాచారాన్ని అర్థం చేసుకొని వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దానికి ఉంది. అందువల్లే అది ఇప్పుడు అన్ని రంగాలలో దూసుకుపోతోంది. తయారీ నుంచి మొదలుపెడితే అంతరిక్ష పరిశోధన వరకు ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. వాస్తవానికి దీనిని కోర్స్ అని అనుకుంటారు గానీ.. ఇది ముమ్మాటికి ఒక రకమైన సాధనం. నేటి కాలంలో యంత్రాలు అత్యంత తెలివిగా మారుతున్నాయి. వెనుకటి కాలంలో యంత్రాలు మెకానికల్గా పనిచేసేవి. ఇప్పుడు అవి సెన్సార్లు.. సమాచారం.. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వంటి వాటితో కలిసి పనిచేస్తున్నాయి. అందువల్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్తరకమైన ఇంజనీరింగ్ వ్యవస్థ తెరపైకి వచ్చింది.
మెకట్రానిక్స్ విభాగంలో స్మార్ట్ ఫ్యాక్టరీలు, అటా నమస్ కార్లు, మెడికల్ రోబోట్స్, డ్రోన్లు వంటి వాటివి దీని కిందికి వస్తాయి. క్వాంటం కంప్యూటింగ్ కూడా ఏఐ పరిధిలోకి వస్తుంది. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి.. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కచ్చితంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
