Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi Movie Body Transformation: పెద్ది మూవీ గ్లింప్స్ లో రామ్ చరణ్...

Ram Charan Peddi Movie Body Transformation: పెద్ది మూవీ గ్లింప్స్ లో రామ్ చరణ్ బాడీ మామూలుగా లేదుగా…దానికోసం అంత కష్టపడ్డాడా…

Ram Charan Peddi Movie Body Transformation: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక క్యారెక్టర్ ను ఒప్పుకున్నాడు అంటే ఆ క్యారెక్టర్ కోసం తన ప్రాణం పెట్టేస్తాడు. దానికోసం ఎలాంటి మేకోవర్ అయిన సరే ట్రై చేస్తాడు. ప్రేక్షకుల నుంచి అటెన్షన్ ను రాబట్టుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. ఒక క్యారెక్టర్ ఏం కోరుకుంటే అది చేయడానికి రెడీ గా ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయనలోని నటుడిని ఒక స్థాయి వరకే చూపించాయి. కానీ ఇకమీదట రాబోయే సినిమాల్లో వైవిధ్యమైన నటుడిని చూడబోతున్నారు అంటూ రామ్ చరణ్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కుస్తీ ఫైట్ కోసం రామ్ చరణ్ తన బాడీని ఒక హల్క్ లాగా మార్చుకున్నాడు. నిజానికి అలాంటి బాడీ రావడం అంటే మామూలు విషయం కాదు…

ఎన్నో డైట్ ప్లానింగ్ ఫాలో అవుతూ 18 గంటల పాటు జిమ్ లో గడిపితే తప్ప అలాంటి బాడీ బిల్డ్ అవ్వదు. డైరెక్టర్ బుచ్చిబాబు సైతం రామ్ చరణ్ కి మొదట ఉన్న బాడీ తో వెళ్దాం అని చెప్పినప్పటికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ కి సరిపోయే విధంగా బాడీ ఉండాలని చెప్పి రంగంలోకి దిగాడు. గ్లింప్స్ లో ఆయన బాడీ మామూలుగా లేదు. ఆ క్యారెక్టర్ లో ఇంటెన్స్ రావాలంటే నేను హల్క్ లాగా మారాల్సిందే అని రామ్ చరణ్ చెప్పి మరి తను హల్క్ లాగా మారిపోయారట.

అయితే తను అలా మారడానికి ఒక స్పెషల్ కోచ్ ను కూడా నియమించుకున్నాడు. ఆ కోచ్ కి దాదాపు మూడు నెలకు కలిపి 3 కోట్ల రూపాయలను చెల్లించినట్టుగా తెలుస్తోంది… రామ్ చరణ్ తన సొంత డబ్బులను ఖర్చుపెట్టుకుని మరి అంత బాడీని బిల్డ్ చేశారట.

ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి ఎంత ఇంటెన్స్ తో నటిస్తాడో రామ్ చరణ్ సైతం అదే విధంగా నటిస్తూ ప్రతి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ వాడుకుంటున్నాడు… పెద్ది సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం రామ్ చరణ్ క్రేజ్ తారా స్థాయికి వెళ్లిపోవడమే కాకుండా తను టాప్ హీరోగా మారుతాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular