Trivikram Venkatesh Remuneration: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొదట రైటర్ గా తన సత్తాను చాటుకొని ఆ తర్వాత దర్శకుడిగా మారిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో సినిక చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆయనకున్న క్రెడిబిలిటీ చాలా ఎక్కువనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వెంకటేష్ ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో ‘నువ్వు నాకు నచ్చావ్’ , ‘మల్లీశ్వరి’ అనే సినిమాలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో జనం సైతం ఇన్ని రోజులపాటు అన్ హ్యాపీగా ఉన్నారు. ఈ కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకసారి వీళ్ళ కాంబో సెట్ అయింది అంటే మాత్రం ఆ సినిమా టాప్ లెవెల్ కి వెళ్తుందనే అంచనా ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఒక భారీ సినిమాను చేసి ప్రేక్షకుల మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…త్రివిక్రమ్ 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటే, వెంకటేష్ 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక వీళ్ళిద్దరికి కలిపి 80 కోట్ల రెమ్యూనరేషన్స్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ రెమ్యూనరేషన్స్ ను చూసి ప్రొడ్యూసర్ నాగ వంశీ భయపడిపోతున్నాడు అంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి…
నిజానికి సినిమా బడ్జెట్ 150 కోట్లయితే అందులో సగం డబ్బులు వీళ్ళకే రెమ్యునరేషన్స్ గా వెళ్ళిపోతుంటే సినిమా ఎలా చేయాలి అనే ధోరణిలో కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా మేకింగ్ కి ఎక్కువ ఖర్చు చేసి మూవీ చేస్తే బాగుంటుంది.
కానీ వీళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని సినిమాకి తక్కువ డబ్బులు కేటాయిస్తే మూవీ ఎలా వస్తోంది అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఇక వెంకటేష్ ఈ సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే రెమ్యూనరేషన్స్ ని కూడా కొంతవరకు పెంచినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్స్ కి కొంత వరకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుండటం విశేషం…