Bigg Boss 9 Telugu Bharani: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో కచ్చితంగా టైటిల్ ని కొట్టేంత సత్తా ఉన్న వారిలో ఒకరు భరణి. సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేయడం తో, ఈయన బిగ్ బాస్ కి వస్తున్నాడు అనే వార్త రాగానే మంచి రఫ్ & టఫ్ గా ఉంటాడేమో అని అనుకున్నారు. కానీ పైన పటారం, లోన లొటారం అన్నట్టు, అత్యంత సాఫ్ట్ పర్సన్ గా మొదటి రోజు నుండే ఆడియన్స్ చేత అనిపించుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ తో ఎంతో స్నేహం గా మెలుగుతూ, అందరినీ ప్రేమిస్తూ, బిగ్ బాస్ సీజన్ 9 కి రేలంగి మావయ్య అని అనిపించుకున్నాడు. ఇదే ఆయన ఆట ని చంపేస్తోంది.
టాస్కులు ఆడడంలో ఇతను హౌస్ లో అందరికంటే తోపు అని చెప్పొచ్చు. కుర్రాళ్లతో సమానంగా గేమ్స్ ఆడగలడు. మంచి స్ట్రాటజీలు వేయగలడు, ఇతన్ని కొట్టే వాళ్లంటూ హౌస్ లో ఎవ్వరూ లేరు అనే రేంజ్ లో మొదటి మూడు వారాలు తన గేమ్ ని ఆడుతూ వచ్చాడు. ఆ మొదటి మూడు వారాల్లో తనూజ తో మంచి బాండింగ్ ఉండేది. ఆ బాండింగ్ ఈయన గేమ్ పై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆడియన్స్ కి చాలా పాజిటివ్ గా కనిపించేవాడు, టాప్ 3 లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మూడవ వారం లో దివ్య అడుగుపెట్టిందో అప్పటి నుండి ఈయన గేమ్ మొత్తం పోయింది. నాన్న అంటూ ప్రేమగా పిల్సీహే తనూజ కి దూరం అయ్యాడు. ఆ సమయం లో పాపం ఆమె ఎంత బాధపడిందో రెండు తెలుగు రాష్ట్రాల జనాలు చూసారు. దివ్య కావాలని వాళ్ళిద్దరిని దూరం చేసేలా, 24 గంటలు భరణి ని వదలకుండా ఆయన వెనుకే తిరుగుతూ ఉండేది.
తనూజ, భరణి రిలేషన్ ని ఆడియన్స్ ఎంత ఇష్టపడ్డారో, భరణి, దివ్య రిలేషన్ ని ఒక రేంజ్ లో ద్వేషించారు. ఫలితంగా 5వ వారం లో భరణి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ, రీ ఎంట్రీ తర్వాత దివ్య కి పూర్తిగా బానిసలాగా మారిపోయాడు. దివ్య మా అన్నయ్య అని పిలుస్తుంది కానీ, ఆమె ప్రవర్తన లో ఎప్పుడూ అన్నయ్య అనే ఫీలింగ్ ఉండదు. భరణి పొరపాటున తనూజ తో మాట్లాడితే పగతో రగిలిపోతుంది, ఆ పగ మొత్తాన్ని తనూజ పై చూపించడం గత మూడు వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతే కాదు భరణి పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడం ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన భరణి కూతురు దివ్య కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నిన్న బిగ్ బాస్ 9 స్టేజ్ మీదకు వచ్చిన భరణి అమ్మ కూడా ఇదే చెప్పింది. వాళ్లకు తనూజ బాగా నచ్చారు. పరోక్షంగా భరణి కి తనూజ తోనే ఉండు, దివ్య తో ఉండొద్దు అని చెప్పకనే చెప్పారు. చివరికి తన గురువు గా భావించే నాగబాబు కూడా ఇదే మాట చెప్తాడు. భరణి లో మార్పు వస్తుందేమో, దివ్య కి దూరంగా ఉంటాడేమో అని అనుకుంటే, వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నన్ను మీ ఫ్యామిలీ అర్థం చేసుకోవడం లేదు అంటూ ఏడ్చినా దివ్య ని ఓదారుస్తున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఏమి?, నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా అని అంటాడు. దీన్ని చూసిన తర్వాత భరణి అభిమానులకు కూడా చిరాకు వేసింది. ఎన్ని చెప్పినా ఈయన మారడు, ఇతన్ని ఎవ్వరూ కాపాడలేరు, వచ్చే వారం నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.