Pregnancy: పెళ్లయిన తర్వాత సంతాన లేమి సమస్యలు ఎదుర్కొనేవారు చాలామంది ఉన్నారు. కెరీర్, వ్యాపారం తో బిజీగా ఉండి భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడంతో సంతానంపై దృష్టి పెట్టడం లేదు. కొంతమంది కెరీర్ పూర్తయినంక పెళ్లి చేసుకుని ఆ తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తుండగా.. మరికొందరు అప్పుడే పిల్లలు వద్దు అంటూ వాయిదా వేయడంతో ఆ తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది వైద్యులు సూచిస్తున్న ప్రకారం సంతానం కావాలని అనుకునేవారు నిర్ణీత వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాలని.. వయసు దాటిపోయిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో అనుకున్న సంతానం కలగకపోవచ్చు అని అంటున్నారు. స్రీ, పురుషులు ఇద్దరిలోనూ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావడంతో సంతానం ఆలస్యం అవుతుందని అంటున్నారు. అసలు ఏ వయసులో పిల్లల్ని కనాలి? వయసు దాటిపోతే ఏమవుతుంది?
కెరీర్ లో స్థిరపడిన తర్వాతనే పెళ్లి చేసుకుందామని చాలామంది అనుకుంటున్నారు. ఈ క్రమంలో 30 ఏళ్లు దాటితే గాని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. ఆ తర్వాత సంతానం కోసం ప్రయత్నించగా అనేక రకాల సమస్యలు ఇద్దరిలోను వస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు 35 ఏళ్లు దాటిన తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. అంటే సాధారణంగా ఉండే రెండు క్రోమోజోములకు బదులుగా డౌన్ సీన్ రూమ్ ఉన్న పిల్లల ప్రతికణంలో క్రోమోజోమ్ 21 యొక్క అదనపు కాపీ ఉంటుంది. దీనివల్ల పుట్టిన పిల్లల్లో మానసికంగా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 35 ఏళ్లు దాటిన తర్వాత వీరిలో బిపి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ తో బాధపడేవారు పిల్లల్ని కనల్చి వస్తే ఆ ప్రభావం పిల్లలపై ఉంటుంది. మరి ముఖ్యంగా నేటి కాలంలో ఆహార పదార్థాల వల్ల డయాబెటిస్ కు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇలా తల్లి ద్వారా పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అటు పురుషుల్లోనూ 40 ఏళ్లు దాటితే అనేక ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. వీరికి పని ఒత్తిడి కారణంగా బ్లడ్ ప్రెషర్ తో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ తరుణంలో సరైన వయసులోనే పిల్లల్ని కనడం మంచిదని కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు. స్త్రీలు 25 నుంచి 30 ఏళ్ల లోపు.. పురుషులు 35 ఏళ్లలోపు ఉన్నవారు పిల్లల్ని కనాలని అంటున్నారు. ఈ వయసులోనే సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలా కాకుండా వయసు దాటిన తర్వాత సంతానంపై ఆసక్తి కూడా తగ్గుతుంది. ఆసక్తి లేకుండా సంతానం కోసం ప్రయత్నిస్తే ఆ తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు పెంచే సమయంలోనూ వయసు మీద పడడంతో తల్లిదండ్రులు వారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేరు. కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఒకవైపు కెరియర్ పై దృష్టి పెడుతూ మరోవైపు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ జీవితాన్ని కొనసాగించాలని అంటున్నారు.