Rest room Vs Bathroom: ఒకప్పుడు మనదేశంలో నగరాలు, పట్టణాలు మినహా మిగతా ప్రాంతాలలో ప్రజలు అత్యవసరానికి ఆరు బయటకే వెళ్లిపోయేవారు. దీనివల్ల ముఖ్యంగా ఆడవారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందని భావించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ మనదేశంలో మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. అయితే అప్పటికి ఇప్పటికీ చాలామంది అత్యవసరానికి ఆరు బయటకు వెళ్లడం లేదు. మరుగుదొడ్లలోనే తమ కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం వల్ల ఆడవాళ్ళ ఆత్మగౌరవం భంగానికి గురి కావడం లేదు.
మరుగుదొడ్లను చాలావరకు మనదేశంలో బాత్రూంలని పిలుస్తుంటారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో స్నానాల గదిని బాత్రూమ్ అని.. మరుగుదొడ్డిని లెట్ రూం అని పిలుస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బాత్రూంలను వాష్ రూమ్ అని, రెస్ట్ రూమ్ అని పిలవడం పెరిగిపోయింది. ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చింది? బాత్రూం, వాష్ రూమ్, రెస్ట్ రూమ్ కు తేడాలు ఏంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటి మధ్య భేదాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బాత్రూం, వాష్ రూమ్, రెస్ట్ రూమ్.. పదాలు వేరువేరుగా ఉన్నట్టే.. వీటి అర్థాలు, వినియోగం కూడా వేరే విధంగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే వ్యక్తిగత గదిని బాత్రూం అని పిలుస్తుంటారు. ఇందులో టాయిలెట్ తో పాటు షవర్ లేదా బాత్ టబ్ ఉంటుంది. బాత్రూం నిర్మాణానికి స్థలం ఎక్కువగా పడుతుంది. స్థలం ఎక్కువగా లేనివారు టాయిలెట్ మాత్రమే నిర్మించుకుంటారు. ఇందులో టబ్, షవర్ వంటి సౌకర్యాలు ఉండవు. వాష్ రూమ్ లో స్నానం చేయడానికి సౌకర్యం లేకపోయినప్పటికీ టాయిలెట్, సింక్ వంటివి ఉంటాయి. ఆఫీసులు, మాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఇవి ఉంటాయి. ఇక రెస్టు రూమ్ అనేది అత్యంత ఫార్మల్ గా ఉంటుంది. ఇందులో ప్రతిదీ కూడా వెస్ట్రన్ విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చిన్నపాటి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది.
వెస్ట్రన్ దేశాలలో ఎక్కువగా రెస్ట్ రూమ్ లు ఉంటాయి. విదేశాలలో కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా కాబట్టి.. రెస్ట్ రూములకు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. పైగా విదేశాలలో అక్కడి ప్రజల కల్చర్ వేరే విధంగా ఉంటుంది. అందువల్లే అక్కడ రెస్ట్ రూమ్ లను విభిన్నంగా నిర్మిస్తుంటారు. మనదేశంలో కూడా కార్పొరేట్ కల్చర్ పెరుగుతుంది కాబట్టి.. ఇక్కడ కూడా అటువంటి నిర్మాణాలు చేపడుతున్నారు.