Ukraine Bought Rafales: ఆపరేషన్ సిందూర్‌తో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్‌ను మన కాళ్లు పట్టుకునేలా చేసింది మన సైన్యం. పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూనే.. పాకిస్తాన్‌లోకి 11 వైమానిక స్థావరాలను మన వైమానికదళం తుక్కుతుక్కు చేసింది. యుద్ధం ముగిసి ఆరు నెలలైనా పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోలేదు. మరమ్మతు పనులు కొనసాగిస్తోంది. ఇక మన సుదర్శన చక్రం ఎస్-400 పాకిస్తాన్ లాంచర్లు, రాకెట్లు, డ్రోన్లను నింగిలనే కూల్చేసింది. రఫేల్, బ్రహ్మోస్ మిసైళ్లు సమర్థవంతంగా పనిచేశాయి. ఇక ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పుడు అమెరికా మిత్ర దేశం ఉక్రెయిన్ కూడా ఎఫ్-16 కొనుగోలుకు నిరాకరించింది. ఫ్రాన్స్ నుంచి వంద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఇది ఉక్రెయిన్ సైన్యం వైమానిక సామర్థ్యాన్ని బలపరచటంలో కీలకం కానుంది. ఫ్రెంచ్ రఫేల్ యుద్ధ విమానం ఎఫ్-16లకన్నా అధునాతనమైన అనేక సాంకేతిక కారణాలతో పునాదిగా ఎంపిక చేయబడింది.
గురితప్పిన ఎఫ్-16..
భారత సైన్యం 2025లో పాక్ కీలక సైనిక స్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల దోరణిలో ఉంది. పాకిస్తాన్ ఉపయోగించిన అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రఫేల్ నేల కూల్చింది. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం అధిక నష్టాలు లేకుండా పాక్ కీలక స్థావరాలకు దెబ్బ కొట్టింది, ఇందులో రఫేల్ ఫైటర్ జెట్‌లు కీలకపాత్ర పోషించాయి.
ఫ్రాన్స్‌తో ఉక్రెయిన్ ఒప్పందం..
పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతుతో అమెరికా ఎఫ్-16 పై విస్తృతంగా ప్రచారం చేసింది. ఆయుధాల కొనుగోలుకు వివిధ దేశాలపై ఒత్తిడి తెచ్చింది. చివరకు మిత్రదేశం ఉక్రెయిన్‌కు అంటగట్టేందుకు యత్నించింది. కానీ క్షేత్రస్థాయి ఫలితాలు బాగా లేకపోవడంతో అమెరికాకు చెందిన ఎఫ్-16 విమానాలను తిరస్కరించింది. వ్యూహాత్మకంగా ఫ్రాన్స్ రఫేల్స్ పై దృష్టి పెట్టింది. భారత ఆపరేషన్ సింధూర్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది.
ఉక్రెయిన్ వాయుసేనలో రఫేల్ విమానాలను ఆహ్వానించడం, భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో ప్రదర్శించిన సమర్థతలు, ఆధునిక యుద్ధ వ్యూహాల పరస్పర అనుసంధానానికి దారితీస్తున్నాయి. అమెరికా పై ఆధారపడకుండానే ఇతర దేశాల యుద్ధ సామర్థ్యాలపై గట్టి అవగాహన, భద్రతా ప్రాధాన్యతలను ఉక్రెయిన్ గమనిస్తోంది. ఇది భవిష్యత్తులో ప్రపంచ వ్యూహాలలో ప్రధాన మార్పులకు తెచ్చే అవకాశం ఉంది.