Obesity Affect Fertility: నేటి కాలంలో చాలామంది ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. ఇంట్లో కంటే బయట దొరికే చిరు తిండి ఎక్కువగా తినడానికి ఆసక్తి చెబుతున్నారు. అంతేకాకుండా మోతాదుకు మించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒబెసిటీ కి గురవుతున్నారు. శరీరంలో మోతాదుకు మించిన కొవ్వు పేరుకు పోవడానికి ఒబెసిటీ అంటారు. అవసరం లేని కొవ్వు పేరుకుపోవడం వల్ల మనుషులు లావుగా కనిపిస్తారు. ఇలా లావుగా ఉండడంవల్ల నీరసం ఎక్కువగా ఉండి ఏ పని చేయడానికి ఆసక్తిగా ఉండదు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా తేలిన విషయం ఏంటంటే ఒబేసిటీ వలన ఫెర్టిలిటీ తగ్గిపోయే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అది ఎలా అంటే?
పురుషులు, మహిళల్లో ఒబేసిటీ కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మహిళల్లో సరైన సమయంలో అండ ఉత్పత్తి జరగకుండా ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ రూమ్ రావచ్చు. మేనస్త్రువల్ సైకిల్ అసమానతలు ఉండి గర్భదారణకు కష్టంగా ఉంటుంది. కొందరికి గర్భం వచ్చినా కూడా మిస్క్యారెజ్ ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడం.. స్పెర్ము కౌంటు తగ్గడం జరుగుతుంది. అలాగే స్పెర్ము క్వాలిటీ కూడా బలహీనంగా మారుతుంది. ఎలక్ట్రైల్ డిస్పంక్షన్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి.
అందువల్ల ఒబెసిటీ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒబెసిటీ రావడానికి అధికంగా ఆహారం తీసుకోవడం.. ఇలా తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్, చక్కెర, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటే అవి తొందరగా ఒబెసిటీ వచ్చే విధంగా చేస్తాయి. ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడంతో పాటు వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలేమితో పాటు caryisole హార్మోన్ పెరిగి బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా ఒబెసిటీ పెరుగుతుంది. ఎక్కువగా కూర్చుని ఉద్యోగం చేసే వారిలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఒబేసిటీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇందులో జాగింగ్ లేదా వాకింగ్ యోగా వంటివి చేర్చుకోవాలి. కూరగాయలు, పండ్లు వంటివి సమపాలలో తీసుకుంటూ ఉండాలి. చక్కెర, వెన్న, ఫ్రైడ్ కలిగిన ఐటమ్స్ ను తగ్గించాలి. ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి. కనీసం 2.5 లీటర్ల నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. నిద్రలేమి కారణంగా కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్రపోయే ప్రయత్నం చేయాలి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సభ్యుల సమస్యల కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ.. మానసికంగా ప్రశాంతతను ఏర్పరచుకోవాలి. ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.