Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ప్రకాష్ రాజ్(Prakash Raj) ఈమధ్య కాలం లో ఏ రేంజ్ లో గొడవ పడ్డారో మన కళ్లారా చూసాము. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాన్సెప్ట్ ని భుజాన వేసుకున్న రోజు నుండి ప్రకాష్ రాజ్ పవన్ ని విమర్శిస్తూనే ఉన్నాడు. పవన్ కూడా ఒక్కసారి ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు కానీ, ఆ తర్వాత మాత్రం ఆయన ప్రకాష్ రాజ్ ని పట్టించుకోలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇంటర్వ్యూస్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎక్కడ పడితే అక్కడ, సందర్భం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూనే ఉన్నాడు. వెండితెర మీద వీళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అలాంటిది వీళ్లిద్దరు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వీళ్ళని కామన్ గా అభిమానించే ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదు. అయితే వీళ్లిద్దరు కలిసి రీసెంట్ గా ‘ఓజీ'(They Call Him OG) చిత్రం లో నటించారు.
నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ‘ప్రకాష్ రాజు గారు ఈ సినిమాలో కొనసాగడం మీకు కంఫర్ట్ గానే ఉంటుందా?, మీరు వద్దంటే మార్చేస్తాము అని ప్రొడక్షన్ టీం అడిగారు. దానికి నేను అవసరం లేదు, ఆయనతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే సెట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని రాజకీయ టాపిక్స్ తీసుకొని రావొద్దని చెప్పండి. ప్రొఫెషనల్ గా వచ్చి సినిమా చేసుకొని వెళ్తానంటే నాకు ఎలాంటి సమస్య లేదు. ప్రకాష్ రాజ్ గారికి , నాకు రాజకీయ పరంగా ఎన్నో విబేధాలు ఉండొచ్చు, నా దారి ఆయనకు నచ్చకపోవచ్చు, కానీ సినిమా కోసం కలిసి పనిచేయడం అవసరం. ఆయన గొప్ప నటుడు, ఈ సినిమాలో నటించి, సక్సెస్ లో భాగం అయ్యినందుకు ప్రకాష్ రాజ్ కి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరి ప్రకాష్ రాజ్ నుండి కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా?, లేదంటే సైలెంట్ గా చూసి చూడనట్టు ఉంటాడా అనేది చూడాలి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సుస్వాగతం, బద్రి, జల్సా, కెమెరా మెన్ గంగతో రాంబాబు, వకీల్ సాబ్ మరియు ఓజీ చిత్రాలు వచ్చాయి. వీటిల్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తప్ప, మిగిలిన చిత్రాలన్నీ కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇదే స్పిరిట్ తో ఈ కాంబినేషన్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.