Life Struggle: కొందరు జీవితంలో ఏదో సాధించాలని అనుకుంటారు. కానీ వయసు పైబడి పోతున్నా.. అనుకున్నది పూర్తి చేయలేకపోతుంటారు. ఈ క్రమంలో కొంత వయసు గడిచిపోయిన తర్వాత తీవ్ర అసంతృప్తితో ఉంటారు. ఇక జీవితంలో ఏం చేయలేం అని నిట్టూరుస్తూ ఉంటారు. చేతిలో ఉన్న ఏదో ఒక పనితో జీవితాన్ని గడిపేస్తారు. కానీ ప్రతి వ్యక్తికి ఒకరోజు కచ్చితంగా వస్తుంది. అందుకోసం ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంత ప్రయత్నించినా విజయం పొందలేకపోతున్నా నిరాశ చాలామందిలో ఉంటుంది. కానీ ప్రయత్నాలు ఎప్పటికీ ఆపకుండా ఉండాలి. అయితే అలాంటి ప్రయత్నం ఎలా ఉండాలంటే?
ఉదాహరణకు ఒక వ్యక్తి వ్యాపారంలో విజయం సాధించాలని అనుకుంటాడు. ప్రస్తుతం అతడు ఉద్యోగం చేస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయం రాదు. ఒకవేళ ఉద్యోగం చేస్తూనే వ్యాపారం ప్రారంభించి విజయవంతం అయిన తర్వాత ఉద్యోగం మానేయాలని అనుకుంటాడు. కానీ సంవత్సరాలు గడిచినా కూడా ఆ వ్యాపారం అభివృద్ధి చెందలేదు. దీంతో అతడు తన ప్రయత్నాన్ని మానుకోవాలని అనుకుంటాడు. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఏదైనా ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయకపోవడం. కనీసం ఏడాది లేదా రెండు సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి.
ఒక వ్యాపారం ప్రారంభించిన తర్వాత కొత్తలో ఎవరికి తెలిసి ఉండదు. అయితే ఒక ఏడాది తర్వాత తన వ్యాపారం గురించి ఎంతమందికి తెలిసి ఉంటుంది? అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ అనుకున్న దానికంటే తక్కువ మందికి తెలిస్తే.. వ్యాపారం గురించి ప్రచారం చేయడానికి కొత్త పద్ధతులను అలవర్చుకోవాలి. అప్పటివరకు కేవలం మాటల ద్వారా ప్రచారం చేస్తే.. ఇప్పుడు ట్రెండు మార్చి సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేయగలగాలి.
వ్యాపారం సక్సెస్ కాలేదని నిరాశతో ఉన్న సమయంలో అప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడడానికి సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరితో అయితే సంతోషంగా ఉంటారో ఆ వ్యక్తులను కలుస్తూ ఉండాలి. ఈ సమయంలో అవమానించే వారి దగ్గరికి వెళ్తే మరింత కుంగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఎలాంటి నైపుణ్యం అవసరమో తెలుసుకోవాలి. అందుకోసం అవసరమైతే ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో కాస్త సహనం అవసరం.
ఒక వ్యక్తి అనుకున్న సమయంలో విజయం పొందలేకపోవచ్చు. అందుకు కొందరి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. KFC చికెన్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే. దీని అభివృద్ధి కావడానికి Colonel Garland Sender’s కు 60 ఏళ్లు పట్టింది. అంటే అతడు నిత్యం శ్రమించడం వల్లే ఇది సాధ్యమైంది. అంతకుముందు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతడు నిష్క్రమించలేదు. అలా ఎవరైనా తన జీవితం అయిపోయింది అని అనుకోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి.
ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. దీనినే Restart అని కొందరు భావిస్తూ ఉంటారు. అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం సాధించే అవకాశాలు ఉంటాయని అంటూ ఉంటారు. అందువల్ల విజయం సాధించేవరకు పోరాడుతూనే ఉండాలి.