Honeymoon: పెళ్లయిన కొత్తజంట హనీమూన్ కు వెళ్లాలని ప్లాన్ వేస్తూ ఉంటుంది. కొత్త వ్యక్తితో కొన్ని రోజులపాటు సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వీరు లవ్ కపుల్స్ అయితే మరింత ఎంజాయ్ చేయాలని ఆశపడతారు. ఇలాంటి వారికి నీటిపై తేలియాడే పడవలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఆ పడవలో రోజంతా గడిపితే ఎలా ఉంటుంది? మరి అలాంటి ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయా? అంటే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇలాంటి అందమైన ప్రదేశం కేరళలో ఉంది. మరి అక్కడికి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది?
ప్రకృతి లో ఎంజాయ్ చేయడానికి కేరళ ది బెస్ట్ స్టేట్ గా కొందరు పేర్కొంటారు. సముద్రానికి ఈ రాష్ట్రం దగ్గరగా ఉండడంతో చాలా ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రదేశాలు చాలా అందంగా కనిపిస్తాయి. వీటిలో కొన్ని టూరిస్టులను అలరిస్తుంటాయి. అయితే కేరళలోని అలెప్పి అనే ప్రాంతం హనీమూన్ జంటకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ చెట్లు ఉంటూ.. మధ్యలో నీరు నిలిచి ఉంటుంది. ఈ నీటిపై పడవలో హాయిగా విహరించవచ్చు. ఇక్కడికి హనీమూన్ జంట వెళితే.. ప్రత్యేకంగా బోట్ ను రెంట్ తీసుకొని 20 నుంచి 24 గంటల పాటు ఎంజాయ్ చేయవచ్చు. వీరికి అవసరమైన ఆహారంను కూడా అరేంజ్ చేస్తారు. ఒక రోజంతా ఏకాంతంగా ఎలాంటి డిస్ట్రాబెన్స్ లేకుండా ఉండడానికి ఇది అనువైన ప్లేస్ అని చాలామంది పేర్కొంటున్నారు.
కేరళలోని అలెప్పి ప్రాంతానికి వెళ్లడానికి అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయి. విజయవాడ నుంచి కొట్టాయం, చంగానస్సేరి వరకు ట్రైన్లో వెళ్లవచ్చు. అక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అలెప్పి ఉంటుంది. ఇక్కడికి ప్రత్యేక వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక్కో బోట్ రోజంతా రెంట్ తీసుకుంటే రూ.5000 చెల్లించాలి. కపుల్స్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల ఖర్చులతో కలిపి.25,000 అవుతుందని కొందరు చెబుతున్నారు.
కేవలం అలెప్పి మాత్రమే కాకుండా.. మున్నార్ వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. చాలామంది హనీమూన్ అనగానే కొడైకెనాల్, ఊటీ వంటివి ప్రాంతాలకు ప్లాన్ చేసుకుంటారు. అయితే చాలామంది ఇప్పటికే ఇక్కడికి వెళ్లి వచ్చి ఉంటారు. కొత్త ప్రదేశంలో అనుభూతి పొందాలని అనుకునేవారు.. నేటి కాలం పెళ్లయిన జంటకు బెస్ట్ హనీమూన్ కావాలని అనుకునే వారికి కేరళలోని అలెప్పి బెస్ట్ ప్లేస్ అని చాలామంది పేర్కొంటున్నారు. అయితే ఇక్కడికి స్నేహితులతో రావడం కంటే కపుల్స్ తో రావడం ఎంతో బెటర్ అని కొందరు చెబుతున్నారు.