Parliament winter session 2021: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సోమవారం రద్దయ్యాయి. రెండు సభల్లో ఆమోదం పొందాయి. దీంతో బిల్లులు రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎలాంటి చర్చ జరగకుండానే ప్రతిపక్షాల మద్దతు లేకుండానే బిల్లులు రద్దు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ బిల్లులు రద్దయినట్లు ప్రకటించడంతో సభ నిర్వహణ సాగిపోయింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా కోరారు. దీనికి ప్రతిపక్ష నేతలు మాత్రం స్పందించారు. బిల్లుపై చర్చ లేకుండా ఎలా ఆమోదం తెలుపుతారని ప్రశ్నించారు. రైతుల డిమాండ్లు పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే బిల్లు రద్దయినందుకు సంతోషంగానే ఉన్నా చర్చ లేకుండా ఎలా అని దాడి ప్రారంభించారు.
కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దీనిపై స్పందిస్తూ చర్చ లేకుండా బిల్లును ఎలా ఆమోదించారని అడిగారు. చర్చ చేపట్టాల్సిందే అని పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ప్రతిపక్షం చొరవను తేలిగ్గా తీసుకుంది. రెండు సభల్లో వాగ్వాదం చోటుచేసుకుంది. సభా నిర్వహణలో మర్యాదలు పాటించడం లేదని దుమ్మెత్తిపోశాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంది.
Also Read: నేటి నుంచి పార్లమెంట్ సభా సమరం.. మోడీపై ప్రతిపక్షాల ప్రధాన అస్త్రాలివే
సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదు. దీంతో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రెండు సభల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ లోక్ సభను మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Also Read: రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన ఆ మూడు చట్టాల్లో ఏముంది ?