RRR Movie Ticket: సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ పలు వివాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు ప్రభుత్వ నిర్ణయానికే నిర్మాతలు తలొగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వానికే మద్దతు పలుకుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అంటూ నిర్మాతలు తలొగ్గి ప్రభుత్వానికి వంత పాడుతున్నారని తెలుస్తోంది. కానీ చిన్న చిత్రాల వరకు ఓకే కానీ పెద్ద చిత్రాలకు కూడా ప్రభుత్వ ఆజమాయిషీ ఉంటే నిర్మాతలకు భారీ నష్టమే మిగులుతుంది. ఓపెనింగ్ లోనే వసూళ్లు రాబట్టుకోవాలంటే టికెట్ల ధరలు తక్కువ ఉంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ రూ.450 కోట్లతో రూపొందుతోంది. దీని కోసం భారీ బడ్జెట్ కావడంతో సినిమాపై అంచనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. అయితే ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించడంతో నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా రాబడి రాబట్టుకునేందుకు మొదట్లోనే టికెట్ల ధరలు భారీగా పెంచి ఉపశమనం పొందాలనేది నిర్మాతల ఆశ. కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో ఆ వెసులుబాటు లేకుండా పోతోంది.
Also Read: టికెట్టు ధరల తగ్గింపుపై జగన్తో చర్చిస్తాం- ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
అయితే ఈ సినిమా గిరిజన చారిత్ర పోరాటాల వీరుల కథ కావడంతో ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇష్తుందని అందరి ఆశ. కానీ జగన్ మాత్రం ఎవరి మాట వినరని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయినా టికెట్ల విషయంలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపించడం లేదని సమాచారం. మరోవైపు వైసీపీ మంత్రి కొడాలి నానికి ఎన్టీఆర్ మంచి స్నేహితుడు కావడంతో వారిద్దరు కలిసి జగన్ ను కలిసి టికెట్ల విషయం చర్చించనున్నట్లు చెబుతున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు రేసులో నుంచి ‘గంగూబాయి’ ఔట్!
టికెట్ల తగ్గింపు వ్యవహారంతోనే రాష్ర్టంలో విమర్శలు వచ్చినా ఎందుకులే అనే ధోరణిలో అందరు మాట్లాడటం లేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టమే కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా పట్టింపులకు పోకుండా పెద్ద చిత్రాలకు వెసులుబాటు కలిగించేందుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాల ఆలోచన.