మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. పార్టీలు కూడా హోరాహోరీ పోరుకు రెడీ అయ్యాయి. అంతేకాదు.. ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 నియోజకవర్గాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 117. అయితే.. ఈ సారి గెలుపుపై డీఎంకే నమ్మకం పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటివరకు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే అలజడి అందరిలోనూ ఉండేది. ఇక ఆయన ఎట్టకేలకు రాజకీయాల్లోకి రానని ప్రకటించడంతో తమ విజయం ఖాయమని డీఎంకే గట్టిగా నమ్ముతోంది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలని డీఎంకే నేత స్టాలిన్ నిర్ణయించారు.
Also Read: భారత్ తో గాల్వాన్ ఘర్షణ వీడియో రిలీజ్ చేసిన చైనా.. వైరల్ వీడియో
అయితే.. కూటమిలోని పార్టీలే డీఎంకేకు స్టాలిన్‌కు అడ్డంకిగా మారాయి. వాళ్లు గెలవకపోగా తమ విజయానికి అడ్డుపడే అవకాశముందని డీఎంకే భావిస్తోంది. అందుకే తొలి నుంచి డీఎంకే సీట్ల పంపకంపై స్పష్టతతో ఉంది. ఈసారి గతంలో మాదిరి సీట్లు ఇవ్వలేమని ముందు నుంచి చెబుతూ వస్తూ కూటమిలోని పార్టీలను మానసికంగా సిద్ధమవుతోంది. డీఎంకే కూటమిలో దాదాపు ఎనిమిది పార్టీలున్నాయి. వీరందరికీ సీట్ల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
అందుకోసమే డీఎంకే 180 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కూటమిలోని పార్టీలు ఏమనుకున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకూడదని డిసైడ్ అయింది. కూటమిలోని ఎనిమిది పార్టీలకు 54 సీట్లను మాత్రమే కేటాయించాలని డీఎంకే నిశ్చయించింది. కాంగ్రెస్‌కు కేవలం ఇరవై స్థానాలను మాత్రమే ఇవ్వనుంది. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 40 స్థానాలు ఇస్తే ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది. అందుకే ఈసారి సగం సీట్లకు తగ్గించింది.
Also Read: చంద్రబాబుకు ఇంతకంటే అవమానం ఉండదేమో?
కాంగ్రెస్‌కు ఇరవై స్థానాలు ఇవ్వగా మిగిలిన 34 స్థానాలు ఏడు పార్టీలకు ఇవ్వనున్నారు. ఎండీఎంకేకు 10, డీపీఐ, సీపీఐ, సీపీఎంలకు కలిపి ఎనిమిది సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన 16 స్థానాల్లో ఇండియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కచ్చి, కొంగునాడు మక్కల్ కట్చి, తమిళ వాళ్వురిమై పార్టీలకు సీట్ల పంపణీ చేయనున్నారు. 180 స్థానాలలో డీఎంకే అభ్యర్థులు పోటీ చేస్తే గుర్తు ప్రభావంతో మ్యాజిక్ ఫిగర్ చేరుకవచ్చన్నది డీఎంకే అంచనా. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఒంటరిగానే తమ సత్తా చాటి.. మెజార్టీ సీట్లలో పోటీ చేయాలని స్టాలిన్ భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: 2021 tamil nadu elections mk stalin adjustment of seats
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com