Home2021 రౌండ్ అప్Tollywood: టాలీవుడ్‌‌ను ఊపేసిన కొత్త అందాలు.. ప్రేక్షకులను చూపుతిప్పుకోనివ్వని కుర్ర హీరోయిన్స్!

Tollywood: టాలీవుడ్‌‌ను ఊపేసిన కొత్త అందాలు.. ప్రేక్షకులను చూపుతిప్పుకోనివ్వని కుర్ర హీరోయిన్స్!

Tollywood: దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా అందులో టాలీవుడ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ నయా టాలెంట్‌కు ఎల్లప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. అందుకే ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ ఇక్కడే తమ అదృష్టాన్ని వెతుక్కుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఉన్న హీరోయిన్స్ ఎవ్వరూ తెలుగు వారు కాదంటే అతిశయోక్తి కాదు.. సమంత నుంచి నయనతార వరకు, రష్మిక నుంచి రకుల్, తమన్నా నుంచి అనుష్క, కాజల్ అగర్వాల్ ఇలా అందరూ నార్త్, సౌత్‌కు చెందిన వారే.. కానీ టాలీవుడ్‌లో దశాబ్దకాలంగా వీరు తమ హవాను కొనసాగిస్తున్నారు. అయితే, ఇండస్ట్రీలో ప్రతీ ఏడాది కొత్త నీరు వస్తుంటే పాత నీరు వెళ్తుంటుంది.

ఈ ఏడాది హిట్ మూవీస్..

కరోనా సెకండ్ వేవ్ 2021 ఆగస్టు తర్వాత సినిమా పరిశ్రమ మళ్లీ గాఢీన పడిందని చెప్పుకోవచ్చు. 2020లో కరోనా కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి. అయితే, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సినిమా షూటింగులు ప్రారంభం అవ్వగా కొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కే పరిమితమయ్యాయి. మరికొన్ని థియేటర్ల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది ఓటీటీ, థియేటర్లలో విడుదలైన సినిమాల్లో క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఉప్పెన, అఖండ, పుష్ప వంటి సినిమాలు మంచి హిట్‌తో పాటు వసూళ్లు రాబట్టాయి.

టాలీవుడ్‌ను మెప్పించిన కుర్ర హీరోయిన్లు

ఈ ఏడాదిలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోయిన్లు అడుగుపెట్టారు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సిన నటి ‘కృతిశెట్టి’. ఉప్పెన సినిమాతో తెలుగు వెండితెరపై కనిపించిన ఈ కన్నడ భామ ఇక్కడి ప్రేక్షకుల మనసులను దోచెసింది. ఉప్పెన మూవీ తర్వాత కృతిని అందరూ ‘బేబమ్మ’ అంటూ పిలుచుకుంటున్నారు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న బేబమ్మ చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ‘శ్యాం సింగరాయ్’లో సెకండ్ హీరోయిన్‌గా చేసి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌కు చెందని ‘ఫరియా అబ్దుల్లా’ జాతి రత్నాలు మూవీతో మంచి హిట్ అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా ఓకే అనిపించుకుంది. ఈ అమ్మడు కూడా ప్రస్తుతం బిజీగా మారిపోయింది.

Tollywood
Tollywood Heroine Krithi Shetty

నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ ‘శ్రీలీల’. ఈ సినిమా యావరేజ్‌ టాక్ సొంతం చేసుకున్నా శ్రీలీల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ‘లవర్స్’ మూవీ ఫేం.. కన్ను కొడుతూ బుల్లెట్ పేల్చి నేషనల్ వైడ్ పాపులరైన ‘ప్రియా ప్రకాశ్ వారియర్’ తెలుగులో నితిన్ హీరోగా ‘చెక్’ మూవీలో చేసింది. తర్వాత కుర్ర హీరో తేజ సరసన ‘ఇష్క్’ మూవీలో కనిపించింది. ఇక చెన్నై సుందరి ‘అమృతా అయ్యర్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘రెడ్’ మూవీలో నటించింది.

Tollywood
Tollywood Heroine Sree Leela

Also Read: బికినీలో సమంత.. శృతిమించిన అందాల ఆరబోత !

చివరగా స్టార్ కూతురు ‘శివానీ రాజశేఖర్’ తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన ‘అద్భుతం’ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. వీరంతా తమ అందం, అభినయంతో పాటు జయపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మన్ననలు పొందారు.

Tollywood
Tollywood Heroine Shivani Rajasekhar

Also Read: ఎన్టీఆర్, చరణ్ లలో గొప్ప గుణాల సీక్రెట్స్ చెప్పిన రాజమౌళి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular