A. R. Rahman Son Ameen Accident: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ కుమారుడు అమీన్ ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసాడు.ఆయన మాట్లాడుతూ ‘నేను లైవ్ మ్యూజిక్ ప్రదర్శిస్తున్న సమయం లో షాన్డియార్లు, లైట్లు మరియు ఇతర వస్తువులు పైన నుండి ఒక్కసారిగా పడిపోయాయి’.
‘నేను వెంటనే అప్రమత్తమై పక్కకి జరిగాను కాబట్టి సరిపోయింది.లేకపోతే ఘోరప్రమాదం జరిగి ఉండేది , ప్రస్తుతానికి నేను సురక్షితంగానే ఉన్నాను’ అంటూ అమీన్ ఈ సందర్భంగా సోషల్ మీడియా లో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.అభిమానులు ఆ పోస్ట్ ని చూసి చాలా భయపడిపోయారు.దేవుడి చల్లని చూపు వల్ల నీకేమి అవ్వలేదని, దయచేసి ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి అంటూ అమీన్ కి జాగ్రత్తలు చెప్తున్నారు ఫ్యాన్స్.
ఇక అమీన్ విషయానికి వస్తే తండ్రిలాగానే ఇతను కూడా మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టాడు.తన అద్భుతమైన గాత్రం తో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడాడు.అయితే ఎక్కువగా ఈయన తన తండ్రి కంపోజ్ చేసిన ట్యూన్స్ కి పాటలు పాడాడు.తెలుగు, హిందీ , ఇంగ్లీష్ , మరాఠీ ఇలా అన్నీ భాషలకు కలిపి సుమారుగా 50 పాటలు వరకు పట్టినట్టు సమాచారం.ఇతని గొంతుకి లక్షల సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు.రాబొయ్యే రోజుల్లో ఈయన కూడా తన తండ్రిలాగానే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడో లేదో చూడాలి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More