Pushpa 2- Akshay kumar: ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి ‘పుష్ప : ది రూల్’.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో 2021 వ సంవత్సరం లో విడుదలై పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించిన ‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.
ఆ అంచనాలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా ఉండేందుకు డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు.ప్రతీ సన్నివేశం ఎంతో గ్రిప్పింగ్ గా ఉండేట్టు,అభిమానుల అంచనాలకు పదింతలు ఎక్కువగా ఉండేట్టు ఈ స్క్రిప్ట్ ని తయారు చేసాడట.పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కతున్న సినిమా కాబట్టి కథకి అనుగుణంగా కాస్టింగ్ కూడా భారీ గా ఉండేట్టు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది.
అందుకు తగ్గట్టుగానే స్టార్ కాస్టింగ్ ని కూడా సిద్ధం చేసాడు సుకుమార్.ఇప్పటికే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ వంటి నటులు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా పుష్ప 2 లో నటించబోతున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే సుకుమార్ అక్షయ్ కుమార్ ని కలిసి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించాడట.అక్షయ్ కుమార్ ప్రస్తుతం స్లంప్ ఫేస్ లో ఉన్నాడు.ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆయనకీ వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడ్డాయి.
రీసెంట్ గా విడుదలైన సెల్ఫీ సినిమా కూడా దారుణంగా పరాజయం పాలైంది.అలాంటి సమయం లో పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం రావడం ఆయన కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు.అంతే కాదు సౌత్ ఇండియన్ మార్కెట్ కి కూడా అక్షయ్ కుమార్ బాగా దగ్గరవుతాడు.ఇప్పటికే ఆయన ‘2 పాయింట్ O’ చిత్రం మన సౌత్ ఆడియన్స్ కి బాగా సుపరిచితమే.ఇప్పుడు పుష్ప 2 చిత్రం తో మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గర కాబోతున్నాడు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More