Poonam Kaur: హీరోయిన్ పూనమ్ కౌర్ పబ్లిక్ లో ఏడ్చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నన్ను పంజాబీ అమ్మాయి అంటూ తెలంగాణా నుండి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన చెందారు. నేను పుట్టింది తెలంగాణాలో పెరిగింది తెలంగాణాలో. కానీ నా మతం ఆధారంగా నన్ను పంజాబీ అమ్మాయి అంటూ వెలివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి దూరం చేస్తున్నారు. నేను తెలంగాణా ముద్దు బిడ్డను. ఒక సిక్కు ఫ్యామిలీలో పుట్టిన మైనారిటీని కావడం వలనే నా పట్ల వివక్ష చూపుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు.
ఉమెన్స్ డే వేళ పబ్లిక్ లో పూనమ్ కౌర్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. అదే సమయంలో ఆమె మాటలు గుండెలు బరువెక్కేలా చేశాయి.ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమెను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే సందేహం కలుగుతుంది. 2017లో పూనమ్ కౌర్ ఏపీ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఎలాంటి ఫేమ్ లేని పూనమ్ కౌర్ ని ఎంచుకోవడం అప్పట్లో న్యూస్ అయ్యింది. అలాగే మిస్ తెలంగాణ ఈవెంట్ కి పూనమ్ కౌర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్ వార్తలకు ఎక్కారు. రాహుల్ గాంధీ చెయ్యి పట్టుకుని ఆమె నడిచారు. దీన్ని కూడా ఆమె వ్యతిరేకులు తప్పుబట్టారు. విమర్శలు చేసిన వారికి పూనమ్ కౌర్ తిరిగి కౌంటర్లు ఇచ్చారు. పూనమ్ కౌర్ చర్యలు కొంచెం బోల్డ్ గా ఉంటాయి. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఆమె మెజారిటీ ట్వీట్స్ ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంటాయి.
ఇక నటిగా పూనమ్ కౌర్ సక్సెస్ కాలేకయారు. 2006లో పూనమ్ కౌర్ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆమె మొదటి చిత్రం మాయాజాలం. అనంతరం దర్శకుడు తేజా తెరకెక్కించిన ‘ఒక విచిత్రం’ చిత్రంలో నటించారు. వినాయకుడు మూవీ ఆమెకు ఫేమ్ తెచ్చింది. ముప్పై కి పైగా చిత్రాలు చేసిన పూనమ్ కౌర్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేశారు. గత ఏడాది నాతి చరామి చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..#Poonamkaur#telangana #RajBhavan #poonamKaurCryingpic.twitter.com/gwagW0ipNE
— yousaytv (@yousaytv) March 7, 2023
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More