AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు సాయంత్రం జరగాల్సిన వారాహి సభ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో టీటీడీ లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతిష్ట వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ఆయన 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ లో భాగంగా తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డారు పవన్. ఈ క్రమంలో బుధవారం స్వామివారిని తన ఇద్దరు కుమార్తెలతో కలిసి దర్శించుకున్నారు. పవన్ కుమార్తెలు ఆద్య,పొలెనా అంజనా తో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి ముక్కిన ఆయన బంగారం వాకిలి నుంచి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. ప్రధాన అర్చకులు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక పూజలు చేయించారు. అయితే రెండు రోజులపాటు బిజీ షెడ్యూల్ తో పవన్క్షణం తీరిక లేకుండా గడిపారు.
* చికిత్స అందిస్తున్న వైద్యులు
ఈరోజు వారాహి బహిరంగ సభ నేపథ్యంలో తిరుమలలోని రాత్రి బస చేశారు. స్థానిక అతిథి గృహంలో ఉండిపోయారు. అయితే పవన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండడంతో.. తిరుమలలోని అతిథిగృహంలో ప్రత్యేక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వారాహి బహిరంగ సభలో ఏం మాట్లాడాలి అన్నదానిపై.. పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు పవన్. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుతం తీవ్ర జ్వరంతో పవన్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
*డిక్లరేషన్ ప్రకటన
వాస్తవానికి వెన్నునొప్పి కారణంగా నడక మార్గంలోని ఇబ్బంది పడ్డారు పవన్. అనారోగ్యంతో ఉన్నా సాయంత్రం వారాహి దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సనాతన ధర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించనున్నారు ఇదే సభలో. తిరుమలలో లడ్డూ వివాదం బయటికి వచ్చిన క్రమంలోసనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ కావాలని పవన్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. దీనికి హిందూ సమాజం నుంచి బలమైన మద్దతు లభించింది. అదే సమయంలో కొద్దిమంది వ్యతిరేకించారు కూడా. అయినా సరే ఈ వ్యవహారంలో దూకుడుగా కొనసాగాలని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న వారాహి సభలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. తీవ్ర జ్వరంతో పవన్ బాధపడుతుండడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap deputy cm pawan kalyan who is suffering from high fever will there be a varahi sabha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com